భారత దేశాన్ని బ్రిటీష్ పాలన నుంచి విముక్తి కోసం ఎంతో మంది మహానుభావులు తమ ప్రాణాలు పోగొట్టుకున్నారు.  వర్తక వాణిజ్యం కోసం వచ్చిన బ్రిటీష్ వారు మెల్లి మెల్లిగా భారత దేశాన్ని తమ అధీనంలోకి తీసుకొని ఇక్కడ సిరసంపదలు దోచుకున్నారు..ఎదురు తిరిగిన వారిని చంపేవారు. ఇలా భారత ప్రజలను తమ భానిసలుగా చేసుకొని క్రూర పరిపాలన సాగిస్తున్న సమయంలో 1857 లో బ్రిటీష్ పాలనుకు వ్యతిరేక ఉద్యమం వచ్చింది. ఇలా వచ్చిన ఉద్యమాన్ని ఎంతో మంది మహానుభావులు ముందుకు తీసుకు వెళ్లారు.
Image result for subhash chandra bose family
ముల్లును ముల్లుతోనే తీయాలనే ఉద్దేశ్యంతో బ్రిటీష్ సైన్యాన్ని తరికొట్టాలంటే మనకంటూ ఓ సైన్యం ఉండాలనే ఉద్దేశ్యంతో ‘ఆజాద్ హిందూ ఫౌజ్’ ను స్థాపించారు నేతాజీ సుభాష్ చంద్రబోస్. తన సైన్యంతో బ్రిటీష్ వారి గుండెల్లో నిద్రపోయారు. ఓ వైపు మహాత్మా గాంధీ శాంతి యుతంగా పోరాడుతుంటే..మరోవైపు చంద్రబోస్ తన సైన్యంతో బ్రిటీష్ వారిని గడ గడలాడించారు.
Image result for ajad hind fauj
ఇలా సైనిక పోరాటం చేస్తూనే విమాన ప్రమాదానికి గురై చనిపోయినట్లు వార్తలు వచ్చాయి. అయితే వీటిపై ఇంకా మిస్టరీ వీడలేదు..కానీ భారత స్వాతంత్ర్యపోరాట చరిత్రలో ఆయన ఒక ధృవతారలా నిలిచిపోయారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: