జనం కోసం తపించిన నేత వైఎస్సార్ రుణం తీర్చుకోవడానికి, ప్రజల పక్షాన నిలిచే మరో నాయకుడు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ సిద్దమయ్యారు. విజయమ్మ సమక్షంలో ఆయన వైసిపిలోకి చేరుతున్నారు. వైఎస్సార్ ఆశయ సాధన కోసం వైసిపిలో చేరడమే ఏకైక మార్గం, ప్రజలకు సేవ చేయాలంటే దానిని మించింది లేదు, అందుకే జగన్ జైల్లో ఉంటే వైఎస్సార్ సిపికి అండగా నేతల సమూహమే నిలుస్తోంది అంటున్నారు శ్రీశైలంగౌడ్. వైఎస్సార్ తో దశాబ్దాల తరబడి ఉండి ఎన్నో ప్రయోజనాలు, మరెన్నో పదవులు అనుభవించిన ఉండవల్లి, లగడపాటి, ... ఇలా ఎందరో ఆయన మరణించాక మాటల్లో ఎంత తేడా చూపించారో చూస్తున్నాం. కాని శ్రీశైలంగౌడ్ కు కాంగ్రెస్ టికెట్ ఇవ్వలేదు, ఆయన వెంట బలగాలు లేవు, స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు, ఆయనకున్న బలం జనం, అంతకు మించి వైఎస్ఆర్ ఆదర్శం అందుకే జన నీరాజనం శ్రీశైలంగౌడ్ ను ఎమ్మెల్యేగా గెలిపించింది. స్వతంత్రంగా గెలిచిన ఆయన వైఎస్ తో ఉన్నది చాలా తక్కువ సమయం, ప్రజలు గెలిపించినా... దానికి వైఎస్సార్ ప్రధాన కారకుడని నమ్ముతున్న మనిషి, అందుకే ఇప్పుడు వైఎస్ రుణం తీర్చుకోవడానికి సిద్దమయ్యారు.

తెలంగాణ గడ్డ నుంచి వైసిపిలోకి వెలుతున్న మొట్ట మొదటి సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీశైలంగౌడ్ అందుకే రాజకీయంగా ఆయన వైసిపిలోకి చేరడం ఓ సంచలనం. శ్రీశైలంగౌడ్ హోంమంత్రి సబితకు సన్నిహితుడన్న పేరుంది, ఇప్పుడు ఆమె కూడా వైసిపిలోకి వెలుతుందన్న వార్తలు వినిపిస్ధున్న నేపథ్యంలో... ఈ పరిణామం తెలంగాణ నా సొత్తు అని విర్రవీగుతున్న టిఆర్ఎస్ కు, ఇక తమ పార్టీలోకి ఎందరో వస్తారనుకుంటున్న టిడిపికి ఓ పెద్ద షాక్. మంత్రి సబిత ఆమె వర్గం కూడా వైసిపి బాట పడుతుందేమోనన్న భయాన్ని కాంగ్రేస్ లో కలిగించినట్లయింది. ఇక పెద్ద ఎత్తున సిట్టింగులు, ప్రధాన నాయకులు వైసిపిలోకి వలసబాట పడతారన్న సంకేతాలు శ్రీశైలం గౌడ్ చేరికతో జారి అయ్యాయి.

అయితే శ్రీశైలంగౌడ్ గ్రేటర్ హైదరాబాద్ లో ఓపార్ట్... ఆయనను గెలిపించిన వారిలో అన్ని ప్రాంతాల వారున్నారు, అందుకే సెంటిమెంట్ కు ఆయన ప్రాధాన్యం ఇవ్వడం లేదని గిట్టని వారు పైకి అంటున్నా లో-లోపల ఇప్పుడిప్పుడే తెలంగాణలో బలడుతున్న వైసిపి, తన సత్తా ఏమిటో చూపెట్టడం మొదలుపెట్టిందన్న గుబులు మొదలయింది. పాదయాత్రలో షర్మిల తన వాగ్భానాలతో తెలంగాణలో దూసుకుపోయింది,  రచ్చబండతో విజయమ్మ తెలంగాణ ధూంధాం మొదలు పెట్టిందో లేదో, ఏకంగా ఓ సిట్టింగు ఎమ్మెల్యే వైసిపి లోకి చేరారంటే, వైసిపికి తెలంగాణలో జనం ఆదరణ ఎంత ఉందో అనడానికి ఓ నిదర్శనం.

వైఎస్సార్ పార్టీ అంటేనే అవినీతి, దోపిడి పార్టీ అని దుమ్మెత్తి పోస్తున్న సమయంలో ఈ పరిణామం ఏంటి అన్న ఆశ్యర్యం అందరిలో కలిగింది, శ్రీశైలం ను కదిలిస్తే ఆ నిప్పులాంటి నిజం ఆయన నోట రానేవచ్చింది. వైఎస్సార్ దోచుకున్నాడంటే సామాన్యజనం ఎలా నమ్ముతారు, వారివి వారికి అలాగే ఉన్నాయి, ఎన్నో సంక్షేమ పథకాలు బ్రేకులు లేకుండా ప్రజలకు అందాయి, ఆయన మరణం తర్వాత అవన్నీ దూరమయ్యాయి ఇంత చూసాక వైఎస్ ను ఆడిపోసుకుంటే నమ్మడం మాట అలా ఉంచి వారిని ఆమడదూరం పరుగెత్తిస్తారు అన్నారు శ్రీశైలం.

పాదయాత్రతో చంద్రబాబు, పథకాలతో కాంగ్రెస్, సెంటిమెంట్ తో టిఆర్ఎస్ రా...రమ్మని పిలుస్తున్నా... ఆవైపు నేతల అడుగులు తడబడుతున్నాయి. ఇలాంటి తరుణంలో ఏకంగా సిట్టింగ్ ఎమ్మెల్యే వైసిపిలో చేరడం భవిష్యత్ రాజకీయ ప్రకంపనాలకు ఓ సూచిక. తెలంగాణ ఇస్తే ఇప్పటీకీ సంతోషమే, పైగా... సహకరిస్తాం అని విజయమ్మ, జగన్ ఎప్పుడో అన్నారు, ఇప్పటికీ చెబుతున్నారు. వైసిపి లక్ష్యం వైఎస్సార్ ఆశయాన్ని సాధించడం, ఆయన ఆశయం రాష్ట్రాన్ని అభివృద్ది చేయడం, సంక్షేమ పథకాలతో ప్రజలను సుభిక్షంగా ఉంచడం, దాని కోసం జగన్ తో కలిసి ముందుకు వెల్లేవారికి జనమే అండగా ఉంటారన్న అభిప్రాయం ఇప్పటి శ్రీశైలంతో సహా వైసిపి లో ఉన్నవారంతా అంటున్నారు.

విజయమ్మ పర్యటన ఏర్పాట్లు, తన చేరిక కార్యక్రమపు బిజీలో ఉన్న శ్రీశైలం గౌడ్  ఏపి హెరాల్డ్ [www.APHerald.com] అడగగానే అవన్నీ పక్కనబెట్టి సమయం ఇచ్చి వివరించారు. ఆయనది రాజకీయజీవితం అనడం కన్నా ప్రజా జీవితం అంటేనే కరెక్టు. చిన్నా-పెద్దా, పేద, ధనికుడు అన్న బేదం లేకుండా అన్నా అనగానే అక్కడ ప్రత్యక్షమై ఆదుకునే శ్రీశైలంగౌడ్ ప్రజా జీవితం ఇంకా ముందుకు సాగాలన్నదే ఏపిహెరాల్డ్.కామ్ ఆకాంక్ష.

         


        

 

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: