తమిళనాడులో సంక్రాంతి పర్వదినం సందర్భంగా  ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే జల్లికట్టు పై సుప్రీం కోర్టు నిషేదం విధించింది..ఈ నిషేదాన్ని ఎత్తివేయాలని సుప్రీం కోర్టును ఆశ్రయించిన తమిళనాడు ప్రభుత్వానికి చుక్కెదురైంది. ఈ ఆటపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది.  మరోవైపు జల్లికట్టు తమ సాంప్రదాయమై క్రీడ అని దీనిపై నిషేదం విదించడం సమంజసం కాదని అక్కడి ప్రజలు, రాజకీయ నాయకులు, సినీ నటులు అంటున్నారు.
Image result for supreme court india
అంతే కాదు తమిళనాడు రాష్ట్ర రాజకీయాలన్నీ జల్లికట్టుపైనే తిరుగుతున్నాయి. జల్లి కట్టుపై నిషేధాన్ని ఎత్తివేయాలని అన్ని రాజకీయ పార్టీలు కోరుతున్నాయి.  కొన్ని వందల సంవత్సరాలుగా  సంక్రాంతి పర్వదినం సందర్భంగా తమిళనాడులోని గ్రామీణ ప్రాంతాల్లో జల్లికట్టును ఆడడం సంప్రదాయంగా వస్తోంది.  
సుప్రీం లో తమిళనాడు సర్కార్ కు చుక్కెదురు
ఈ నేపథ్యంలో జంతువులను హింసించడం సమంజసం కాదని అందుకోసమే ఈ క్రిడపై ఆంక్షలు విదించినట్లు కేంద్ర ప్రభుత్వం, సుప్రీం కోర్టు అంటుంది.  ఇక జల్లికట్టుపై నిషేదం ఎత్తివేయాలని ప్రధాని మోడీకి శషికళ లేఖ కూడా పంపారు.  ఏది ఏమైనా తమిళనాడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న అధికార, విపక్షాలు నిషేధం ఎత్తివేయాలని రెండు వారాలుగా పోటాపోటీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

వివాదాలకు కారణమైనక్రీడ


మరింత సమాచారం తెలుసుకోండి: