భారత దేశంలో అవినీతి నిర్మూలను, ఉగ్రవాదుల కార్యకలాపాల ఆట కట్టించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నారు.   రూ. 500, 1000 నోట్లను రద్దు చేసి అక్రమార్కుల గుండెల్లో నిద్ర పోయారు.  అక్రమంగా దొచింది..దాచింది ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఎదుర్కొన్నారు కొంతమంది బడాబాబులు.  అయితే పెద్ద నోట్ల రద్దుతో సామాన్య ప్రజలు మాత్రం నరకం చవి చూశారు.  ఏటీఎం , బ్యాంకుల వద్ద క్యూలు కడుతూ నానా అవస్థలు పడ్డారు.  కాగా 50 రోజుల తర్వాత ఏటీఎం, బ్యాంకుల్లో ఊరట లభించింది.  ఈ నెల నుంచి ఏటిఎం లో కూడా పదివేల కన్నా ఎక్కువ డ్రా చేసుకున్న సదుపాయం కల్పించారు.  వారానికి రూ.24 వేలు విత్‌డ్రా ఆంక్షలను రిజర్వుబ్యాంకు త్వరలోనే ఎత్తివేయనున్నదని చెప్పారు.
సేవింగ్‌ ఖాతా ఆంక్షలపై ఆర్బీఐ తాజా మాట!
ఒక ప్రముఖ వార్తా సంస్ధకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ 'సేవింగ్స్‌ బ్యాంక్‌ ఖాతా నుంచి వారానికి రూ.24 వేలు విత్‌ డ్రాచేసుకునే పరిమితిని ఎత్తివేయడం తప్ప దాదాపు అన్ని ఆంక్షలు ఎత్తివేశారన్నారు. రూ 24 వేలువిత్‌డ్రా పరిమితిని ఎత్తేయడం కొంత సమయం తీసుకునే అంశమన్నారు. నగదు సరఫరా, నిర్వహణ రిజ ర్వు బ్యాంకు బాధ్యతని అన్నారు. 24 వేలు పరిమితిపై ఆంక్షను కూడా త్వరలో ఎత్తేయనున్ననట్లు తెలిపారు.

ఈ నేపథ్యంలో త్వరలోనే కొత్త వంద రూపాయల నోట్లను చలామణిలోకి తీసుకురానున్నట్లు రిజర్వు బ్యాంకు తెలిపింది. జాతిపిత మహాత్మాగాంధీ సిరీస్‌-2005లో భాగంగా జారీ చేసే కొత్త నోట్లు గతంలో విడుదల చేసిన వంద రూపాయల నోట్ల తరహాలోనే ఉంటాయని ఆర్‌బీఐ పేర్కొంది. అయితే గతంలో జారీ చేసిన వంద రూపాయల నోట్లన్నీ చెలుబాటవుతాయని వివరించింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: