తమిళ రాజకీయ నాటకం క్లయిమాక్సుకు చేరుతోంది. దాదాపు నెల రోజులుగా తమిళనాడు ప్రధాన వార్తల్లో ఒక భాగమైపోయింది. జయ మరణం, పన్నీర్ సీఎంగా ప్రమాణం, జల్లి కట్టు పోరాటం, పన్నీర్ రాజీనామా, శశికళ తీర్పు, పళనిస్వామి సీఎంగా ప్రమాణ స్వీకారం.. ఇలా వరుస ఘటనలు తమిళనాడును పతాక శీర్షికల్లో నిలిపాయి. 


శనివారం తమిళనాడు అసెంబ్లీలో జరగనున్న బలపరీక్ష ఈ మొత్తం పొలిటికల్ ఎపిపోడ్ కు క్లయిమాక్స్ లాంటిదన్నమాట. అయితే ఈక్లయిమాక్స్ ముందే ఊహించవచ్చన్నది చాలా మంది అభిప్రాయం. శశికళ ప్రతినిధిగా ఉన్న పళనిస్వామి సులభంగా బలపరీక్ష నెగ్గుతాడన్నది చాలామంది అభిప్రాయంగా ఉంది. ఈ దశలో డీఎంకే నిర్ణయం పన్నీర్ వర్గాన్ని ఆశ్చర్య ఆనందాల్లో ముంచెత్తింది. 



ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఓటింగ్ కు దూరంగా ఉంటామన్న విపక్ష నేత స్టాలిన్.. సాయంత్రానికి మాట మార్చేశాడు. ఉదయం నుంచి ఓటింగ్ కు దూరంగా ఉంటామంటూ వచ్చిన స్టాలిన్.. సాయంత్రానికి తాము పళనిస్వామికి వ్యతిరేకంగా ఓటేస్తామని తేల్చి చెప్పేశాడు. ఈ దశలో పళని స్వామి బలం తగ్గిపోతోంది. 


తమిళనాట ప్రభుత్వం నిలబెట్టుకోవాలంటే కనీసం 119 మంది బలం పళని స్వామికి ఉండాలి. డీఎంకే 90 మందికి పైగా ఎమ్మెల్యేలు, పన్నీర్ వర్గానికి చెందిన 11 మంది ఎమ్మెల్యేలు వ్యతిరేకంగా ఉండటం వల్ల పళనిస్వామి జాగ్రత్తగా ఉండాలి. కనీసం ఓ ఐదుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారినా తమిళ రాజకీయం మరింత రంజుగా సాగుతుందనడంలో సందేహం ఉండదు. 



మరింత సమాచారం తెలుసుకోండి: