ఈ రోజు భారత దేశంలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి.  ఇక త్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ బంపర్ మెజార్టీతో అధికారాన్ని కైవసం చేసుకోనుంది. మొత్తం 403 సీట్లున్న యూపీ అసెంబ్లీలో బీజేపీ 308 చోట్ల స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. ఫలితంగా యూపీ కోటపై కాషాయ జెండా ఎగురవేయడం ఖాయమని తేలిపోయింది.  దీంతో యూపీలో ఓటమిని సమాజ్‌వాదీ పార్టీ అంగీకరించింది. ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కాసేపట్లో రాజీనామా చేయనున్నారు.
Image result for akhilesh rahul
అంతే కాదు ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరి రోజున బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా చెప్పిన జోస్యం అక్షర సత్యమయ్యాయి.  ఈ ఎన్నికల్లో సీఎం అఖిలేశ్‌ యాదవ్‌కు ఓటమి తప్పదని, మార్చి 11న ఉదయం 11 గంటలకు ఫలితాలు వెలువడతాయని, మధ్యాహ్నం ఒంటిగంటకల్లా రాజీనామా సమర్పించేందుకు సిద్ధంగా ఉండాలని వ్యాఖ్యానించారు. మరవైపు ఓటమికి అఖిలేషే కారణమని ములాయం సింగ్ యాదవ్ వర్గీయులు ఆరోపిస్తున్నారు.
Image result for akhilesh rahul
ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ పార్టీతో పొత్తుపెట్టుకోవడాన్ని ములాయం తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే తండ్రి మాటలను వినని అఖిలేష్‌ కాంగ్రెస్‌తో జట్టుకట్టారు. అయితే ఈ పొత్తు వికటించింది. యూపీలో చాలా చోట్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు.  ఈ నేపథ్యంలో  అఖిలేష్ మధ్యాహ్నం రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. గవర్నర్ అపాయింట్మెంట్ కూడా కోరారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: