గత కొంత కాలంగా అమెరికాలో భారతీయులను టార్గెట్ చేసుకొని కొంత మంది దుర్మార్గులు అన్యాయాలకు తెగబడ్డారు.  ఆ మద్య శ్రీనివాస్ ని నిర్థాక్షిణ్యంగా కాల్చి చంపిన ఘటన మరువక ముందే మరో భారతీయుడిని పొట్టన బెట్టుకున్నారు.  వాస్తవానికి అమెరికాలో గన్ కల్చర్ ఈ మద్య తీవ్ర రూపం దాల్చింది.  కొంత మంది దుండగులు గన్ లతో బెదిరించి డబ్బులు, వస్తువులు పట్టుకెళ్లడం పనిగా పెట్టుకున్నారు..వారికి ఎదురు తిరిగిన వారిని కాల్చి చంపడానికి కూడా వెనుకాడటం లేదు.  తాజాగా అమెరికాలో మరో భారతీయుడు కాల్పులకు బలయ్యాడు.
Image result for srinivas murder in america
పంజాబ్‌కు చెందిన విక్రమ్ జర్యాల్ (26) యకిమా నగరంలో ఇద్దరు దుండగులు కాల్చి చంపారు.  యకిమా సిటీలో ఏఎమ్‌-పీఎమ్‌ అనే గ్యాస్‌ స్టేషన్‌లో క్లర్క్‌గా పనిచేస్తున్నాడు విక్రమ్‌ జర్యాల్‌.ఆయుధాలతో గ్యాస్ స్టేషన్‌కి వచ్చిన ఇద్దరు దుండగులు, విక్రమ్ నుంచి డబ్బు డిమాండ్ చేశారు. కౌంటర్ లో నగదు ఇవ్వమని బలవంతం చేయగా వారికి భయపడి నగదు ఇచ్చారు..కానీ వారు విక్రమ్ పై కాల్పులు జరిపి అక్కడ నుంచి పారిపోయారు.  తీవ్ర గాయాలతో ఉన్న విక్రమ్ జర్యాల్ ని ఆసుపత్రికి తరలిస్తుండగానే మృతి చెందాడు.

ఇది జాత్యహంకార దాడేనని అమెరికాలోని భారతీయులు ఆరోపిస్తున్నారు. విక్రమ్ హత్య విషయాన్ని ఆయన సోదరుడు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ దృష్టికి తీసుకొచ్చారు. స్వగ్రామమైన పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌కు తీసుకురావడంలో సహకరించాలని ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేశారు. విక్రమ్ హత్యను ఖండించిన సుష్మ మృతదేహాన్ని భారత్‌కు రప్పించేందుకు అన్ని విధాలా సాయం అందిస్తామని తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: