ఏపీ అమరావతి అనే రాజధాని కట్టుకుంటోంది. హైదరాబాద్ పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ఉండే అవకాశం ఉన్నా.. చంద్రబాబు మాత్రం మూడేళ్లలోనే ఏపీ రాజధాని అమరావతిని తాత్కాలికంగా రెడీ చేసేశారు. ఉద్యోగులను ఇప్పటికే తరలించేశారు. మరోవైపు అమరావతి నిర్మాణం కూడా జోరందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.



ప్రణాళికలు, బ్లూ ప్రింట్లు, నమూనాలు అంటూ చంద్రబాబు ఏదో ఒక హడావిడి  చేస్తూనే ఉన్నారు. ఐతే.. ఇప్పుడు ఇదే ఓ విషయంలో అమరావతి ఏపీకి మైనస్ కాబోతోందా.. అంటే అవుననే తెలుస్తోంది. ఇప్పుడు అమరావతిని తెలంగాణ హైలెట్ చేసి కృష్ణా నీటి కేటాయింపుల్లో తమ వాటా పెంచమని అడిగేందుకు ప్రయత్నిస్తోంది. అమరావతికి కృష్ణా జలాలకూ లింక్ ఏంటనుకుంటున్నారా.. ఉంది మరి..


అమరావతి కోసం చంద్రబాబు 30 వేల ఎకరాలను ఖాళీ చేయించారు. యుద్ధ ప్రాతిపదికన భూసేకరణ చేసేశారు. అంటే ఇప్పుడు ఆ భూముల్లో పంటలు వేయడం లేదు. మరి కృష్ణా డెల్టా కింద ఆ భూముల్లో పంటలు వేయనప్పుడు.. వాటి కోసం ఖర్చు చేసే నీళ్లు కూడా మిగిలిపోయినట్టేగా.. అమరావతి నిర్మాణంతో పాటు.. పోలవరం నిర్మాణం, పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు నీటి తరలింపు వంటి అంశాలను చూపి ఆంధ్రా వాటా నీరు తగ్గించాలని కృష్ణా ట్రైబ్యునల్ కు నివేదిక పంపించింది. 



నీటి కేటాయింపుల్లో కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులకే ప్రాధాన్యం ఇవ్వాలంటోంది తెలంగాణ. పక్క బేసిన్ లోని వినియోగాన్ని లెక్కగట్టి నిర్ణయం తీసుకోవాలని వాదిస్తోంది. అదీ కేవలం ఒక ఆరుతడి పంట అవసరాన్నే పరిగణలోకి తీసుకోవాలని కోరింది. 75 శాతానికి మించి వచ్చే నీటిలోనూ మొదటి ప్రాధాన్యత బేసిన్‌లోని ప్రాజెక్టులకే ఇవ్వాలని వాదిస్తోంది. మరి ఈ వాదనతో కృష్ణా ట్రైబ్యునల్ ఎంతవరకూ ఏకీభవిస్తుందో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: