ఇప్పుడు భారత దేశంలో ఎక్కడ చూసినా ఒకే టాపిక్ పై చర్చ నడుస్తుంది..అదే జీఎస్టీ.  ఆ మద్య భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పెద్ద నోట్ల చలామణి రద్దు చేసిన తర్వాత ఒకింత ప్రజల్లో నిరసన వచ్చినప్పటికీ... నల్ల ధనం నిర్మూలన కోసం తీసుకున్న నిర్ణయం అని ప్రజలకు తెలియజేశారు మోడీ.  తర్వాత 500, 1000 నోట్ల స్థానంలో కొత్తగా 500, 2000 నోట్లు తీసుకు వచ్చారు.  అప్పట్లో ఇది పెద్ద సంచలన విషయంగా సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది.  తాజాగా ఇప్పుడు భారత దేశంలో అమల్లోకి వచ్చిన జీఎస్టీపై రక రకాల చర్చలు మొదలయ్యాయి.
Image result for gst effect kollywood
అయితే దేశ సమగ్రాభివృద్ది సాధించాలంటే పన్ను విధించక తప్పదని..అయితే సామాన్యులకు కష్టమయ్యే రితిలో ఇవి ఉండవని చెబుతున్నారు ప్రధాని మోడీ. తాజాగా జీఎస్టీ ఎఫెక్ట్ మాత్రం తమిళనాడు ఇండస్ట్రీపై బాగా పడినట్లు తెలుస్తుంది.   తాజాగా తమిళనాడులో 1000 సినిమా ధియేటర్లను మూసివేస్తున్నట్టు యాజమాన్యం తెలిపింది. దీనికి కారణం జీఎస్టీ ఎఫెక్ట్ తో తాము బాగా నష్టపోతున్నామని..తమిళనాడు ఎంటర్‌టైన్‌మెంట్  30శాతం కాగా, దీనికితోడు జీఎస్టీ 28 శాతం.. ఈ రెండూ కలిసి 50శాతానికి పైగా చేరడంతో ఆందోళనకు దిగారు ఓనర్స్.
Image result for gst effect kollywood
ఇంత నష్టాన్ని భరిస్తూ తాము థియేటర్స్ రన్ చేయలేమని అక్కడి సినిమా థియేటర్ల ఓనర్స్ ఫెడరేషన్ బంద్‌కి పిలుపునిచ్చింది.   మరోవైపు ఈ బంద్ ని ఎలాగైనా ఆపాలని కొంత మంది నిర్మాతలు విశ్వప్రయత్నాలు చేశారు..కానీ ఫలితం దక్కలేదు.  ఇక జులై 1 నుంచి జీఎస్టీ అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే..కాకపోతే అంతకుముందు వారం రిలీజ్ చేసిన సినిమాలకు ఈ బంద్ చాలా వరకు నష్టాలను తెచ్చే అవకాశం ఉందంటున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: