తెలుగు రాష్ట్రాలు ఉమ్మడిగా ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ కి దివంతగ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఎన్నికైన విషయం తెలిసిందే.  అభివృద్ది పనులకు పట్టం కట్టిన ఎవ్వరినైనా ప్రజలు గుండెల్లో పెట్టి చూసుకుంటారు అన్నదానికి ఇదే ఉదాహరణ అని అప్పట్లో వైఎస్ పదే పదే చెప్పేవారు.  రెండవ సారి సీఎం బాధ్యతలు స్వీకరించిన వైఎస్ రచ్చబండ కార్యక్రమానికి వెళ్తూ హెలికాప్టర్ ప్రమాదంలో అకాల మరణం పొందారు. తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ వారసుడిగా వైఎస్ జగన్ కాంగ్రెస్ తో విభేదించి వైఎస్సార్ సీపి స్థాపించారు.
Related image
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో టీడీపి కొనసాగుతుండగా..ప్రతిపక్ష హోదాలో వైసీపీ కొనసాగుతుంది.  రీసెంట్ గా వైఎస్ జన్మదినం సందర్భంగా అమరావతిలో వైసీపీ ప్లీనరీ నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో అధికార పార్టీని వైసీపీ నాయకులు ఎండగట్టారు.  అంతే కాదు 2019 ఎన్నికల్లో తాను సీఎం అయితే చేసే పనుల గురించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అయ్యాయి.
Image result for వైసీపీ ప్లీనరీ
 ‘అన్న వస్తున్నాడు - నవరత్నాలు తెస్తున్నాడు’ అంటూ ఊరూవాడా చాటిచెప్పాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి.  గతంలో తన తండ్రి పాద యాత్ర చేసి ప్రజలకు బాగా దగ్గరయ్యారు..ఇప్పుడు ఆయన బాటలోనే నడుస్తూ..అక్టోబర్ 27 నుంచి 3 వేల కిలోమీటర్లు మేర పాదయాత్ర చేయాలని నిర్ణయించారు వైఎస్ జగన్.  

అంతే కాదు కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ లో ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రతిఒక్కరికీ చెప్పాలని అందుకే ప్రజలకు వద్దకు  పాదయాత్ర చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు జగన్. ఈను   9 వాగ్దానాలే తమ పార్టీకి వచ్చే ఎన్నికల్లో అధికారాన్ని కట్టబెడతాయని గాఢంగా భావిస్తున్న జగన్, గుంటూరులో ఇటీవల జరిగిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్లీనరీలో ఇచ్చిన వాగ్దానాలపై  ట్విట్‌ చేశారు.  ఇప్పుడు ఈ ట్వీట్ సోషల్ మీడియాల్ తెగ హల్ చల్ చేస్తుంది. 

జగన్ ట్విట్ :

మరింత సమాచారం తెలుసుకోండి: