Related image


భారత కోకిల (నైటింగేల్ ఆఫ్ ఇండియా) గా ప్రసిద్ధి చెందిన సరోజినీ నాయుడు  స్వాతంత్ర సమరయోధురాలు మరియు కవయిత్రి. సరోజినీ నాయుడు 1925 డిసెంబరులో కాన్ పూర్ లో జరిగిన అఖిల భారత జాతీయ కాంగ్రెస్ మహాసభ లకి తొలి మహిళా అధ్యక్షురాలు మరియు స్వతంత్ర భారత తొలి మహిళా గవర్నరు కూడా.

 

ఈ దేశం బానిసత్వం నుంచీ, నియంతృత్వ సంకెళ్ళ నుంచీ విముక్తి పొంది నాది, నేను అన్న స్వతంత్ర భావంతో అఖిల భారత ప్రజానీకం స్వేచ్ఛా, స్వాత్రంత్రాలతో జీవించాలన్నదే నాతి స్వాతంత్ర సమరయోధుల మహత్తర ఆశయం. అటు వంటి పూజనీయులైన పురుషులే కాక, భారత మహిళలు తాము కూడా ఏ రంగంలోనూ, తీసిపోరని, స్వాతంత్ర సమరములోనూ వీరోచితంగా పోరాడగారని నిరూపించిన సాహస మహిళామణులకు మన దేశంలో కొదవలేదు. అటువంటి మహిమాన్విత మహిళామణుల్లో శ్రీమతి సరోజినీ నాయుడు కూడా ప్రముఖులుగానే ఉన్నారు. సరోజిని నాయుడు మంచి రచయిత్రి, కవయిత్రి కూడా.


Image result for sarojini naidu nightingale of india 


1879 సంవత్సరం పిబ్రవరి 13 వ తేదీన హైదరాబాద్ లో ఒక సాంప్రదాయ బెంగాలీ బ్రాహ్మణ కుటుంబం లో సరోజిని జన్మించారు. ఈమె తండ్రి డా. అఘోరనాథ్ చటోపద్యాయ, తల్లి శ్రీమతి వరద సుందరి. అఘోరనాథ్ చటోపాథ్యాయగారు నాటి నిజాం కాలేజీ, హైదరాబాదు లో మొట్టమొదటి ప్రధానోపాధ్యాయుడిగా పనిచేసారు. తల్లి వరద సుందరి చక్కని రచయిత్రి. చిన్నతనం నుంచీ ఆమె బెంగాలీ భాష లో చక్కని కావ్యాలు, కథలు రాసారు.


Image result for sarojini naidu nightingale of india


అఘోరనాథ్ చటోపాధ్యాయ ఎనిమిది భాషలలో పండితుడు. సంస్కృతం, బెంగాలీ, ఉర్దూ, గ్రీకు, జర్మనీ, హిబ్రూ, ఫ్రెంచ్, ఆంగ్లం మొదలైన భాషల్లో ఆయనకు ప్రవేశమే కాదు అనర్గళ ప్రావీణ్యం ఉంది అంతే కాదు ఆయన "ఎడింబరో విశ్వ విద్యాలయం" లో డాక్టరేట్ కూడా.

 

అలాంటి విద్యాధికులతో కూడిన సద్వంశంలో జన్మించిన సరోజిని చిన్నతనం నుంచే కార్యదీక్షా, పట్టుదలా, విద్యపై తిరుగులేని అధిపత్యంతో బహుళ మెధావిగా రచయిత్రి, కవయిత్రిగా ఎదిగారు. పన్నెండేళ్ళ వయసులోనే మదరాసు విశ్వవిద్యాలయం మెట్రిక్ లేషన్ పూర్తి చేయగలిగింది. ఆ విధంగా బాల్యం నుంచే ప్రతి విషయంలోనూ కుతూహలం శ్రద్ద కనబరచి ఏది? ఏమిటి? ఎలా? అని తెలుసుకొనే వరకూ విశ్రమించని వ్యక్తిగా ఎదిగారు మేధావి శ్రీమతి సరోజినీ నాయుడు. తన పదమూడేళ్ళ వయసులో రాసిన "లెడీ ఆఫ్ లేక్" ఆంగ్ల రచనకు ముగ్ధుడైన నిజాం నవాబ్ ఆమెను వివిధ రంగాల్లో పరిశోధనలకోసం ఇంగ్లాండ్ పంపించారు అదీ నాలుగు వేల రెండువందల రూపాయిల వార్షిక విధ్యార్ధి వ్వేతనమిచ్చిఅందుకే ఆమె  ఆవిధంగా శ్రీమతి సరోజినీ నాయుడు నిజంగా ఆదర్శమూర్తి. ఆ విధమైన పట్టుదల క్రమశిక్షణ, ఆమెను భారత దేశ తొలి మహిళా గవర్నరును చేసింది.


Image result for sarojini naidu nightingale of india

 

నిజాం నవాబ్ ప్రోత్సాహం తో ఆమెకు చదువుమీదనున్న ఆసక్తి గ్రహించిన తల్లి దండ్రులు ఆమెను విదేశాలకు పంపారు. సరోజినీ "లండన్ కింగ్స్ కాలేజీ" లోను "కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ అధ్వర్యంలోని గిర్టన్ కాలేజి" లోనూ అధ్యయనం చేసింది. ఈవిడ రాసిన కవితలను చదివి, ఇంగ్లాండ్ లోని ఆంగ్ల భాషా విమర్శకులు "ఆర్థర్ సైమన్స్" ఎడ్వర్ గూస్" లు అభినందించారు. పాశ్చాత్య విధ్వాంసులను చాలా మందిని కలసి వారికి గల పాండిత్యాన్ని ఆకళింపు చేసుకుని వారితో స్నేహ సంబంధాలు పెంచుకుని వారి సలహాలపై, ఇంగ్లీషులో అతి చక్కని గ్రంథాలు వ్రాసింది.


Image result for sarojini naidu nightingale of india


ఆమె రచించిన కావ్యాలలో బర్డ్ ఆఫ్ ది టైం, ది గోల్డెన్ థ్రెషోల్డ్, ది బ్రోకెన్ వింగ్స్ అనేవి చాలా ప్రసిద్ధమైనవి. ఆమె ఇంగ్లాండు లో నివసిస్తూ రచనలు సాగించినా వాటిలో భారతీయ జీవితాలు ప్రతిబింబించేటట్లు చొప్పించి కథా విధానం నడిపించడం ఆమె ప్రత్యేకత. మన జాతి పై ఆమె కున్న ప్రేమ కనబరచటం అందులో  విశేషం. కులం మతం వంటి చాందస భావాలను త్యజించి ఆదర్శ మూర్తిగా గోవిందరాజులు అనే వైధ్యుణ్ణి ప్రేమించి పెళ్ళాడి ఆమె శ్రీమతి సరోజినీ నాయుడు గా మారి కుల మతాతీత భావాలకు చెక్ పెట్టి సమ సమాజ స్థాపనలొ భాగస్వామి అయ్యారు.


Image result for sarojini naidu nightingale of india


ఇది శ్రీమతి సరోజినీ నాయుడు తమ హైదరాబాదు నివాస గృహమైన నాంపల్లి రైల్వే స్టేషనుకు సమీపంలో వున్న ఈ చారిత్రాత్మక బంగళా గోల్డెన్ త్రెషోల్డ్" వారి తండ్రి గారి ఙ్జాపకార్ధం జాతికి అంకితం చేశారు.

 Image result for sarojini naidu nightingale of indiaవివాహమై ఇద్దరు సంతానమున్నా ఆమె కేవలం తన, తన పిల్లల సంతోషం గురించి మాత్రమే ఆలోచించలేదు. ఆనాడు భారతదేశము బ్రిటిష్ వారి పాలనలో శాంతి, స్వేచ్ఛ స్వాతంత్య్రాలు లేక, ప్రతిక్షణం బ్రిటిష్ వారి దౌర్దన్యాలకు గురవుతూ జనం జీవితాలు గడుపుతున్నారు. ఎందరో నాయకులు దేశము నాలుగు మూలల నుండి ప్రజల్లో స్పాతంత్ర భావాలు రేకెత్తించగల ఉద్యమాలు సాగిస్తున్నారు. భారతీయులలో విప్లవ భావాలు తలెత్తడము సహించలేకపోయింది బ్రిటిష్ ప్రభుత్వం.


 Sarojini Naidu sharing tea with Subhash Chandra Bose, Pt Jawaharlal Nehru and others

Sarojini Naidu having tea with Subhash Chandra Bose, Pt Jawaharlal Nehru and others


"గంగిరెద్దుల్లా వారు చెప్పిన దానికల్లా తలలూపుతూ మన సంపదనంతా వారికి ఒప్ప చెప్పి మనము వాళ్ళ చెప్పు క్రింద తేళ్ళ మాదిరిగా జీవిస్తూ వారి ప్రభుత్వానికి సహకరించాలని లనేది వారి అభిప్రాయం" అలాంటి రఒజుల్లో "అఖిల భారత జాతీయ కాంగ్రెస్" గోపాల కృష్ణ గోఖలే నాయకత్వంలో ఉద్యమాలు సాగిస్తోంది.


Sarojini Naidu played a leading role during the Civil Disobedience Movement and was jailed along with Mahatma Gandhi and other leaders. In 1942, she was arrested during the  


ఆతరుణం లో మహిళాభివృద్దికి ఎంతో కృషిచేసి 1906 లో మహిళలకు విద్య అవసరమని దేశమంతా ఎన్నో మహిళా సమావేశాలు ఏర్పరచి మహిళల్లో చైతన్యం తీసుకురావడానికి నాయుడు ఎంతో పాటు పడ్డారు. స్వాతంత్ర సాధనలో తనూ పాలుపంచుకోవాలని ఆలోచించిన శ్రీమతి సరోజినీ నాయుడు కాంగ్రెస్ జాతీయ భావాలకు అనుగుణంగా నడుచు కోనారంభించింది. 1915 వ సంవత్సరం బొంబాయిలో జరిగిన కాంగ్రెస్ మహాసభ లకూ, 1916 లో జరిగిన లక్నో కాంగ్రెస్ సభలలో ఆమె పాల్గొనటం జరిగింది.

 

ఆనాటి కాంగ్రెస్ భావాలు చాలా ఆదర్శంగా ఉండేవి. సరోజినీనాయుడు భారతదేశములో గల ముఖ్యమైన, నగర, పట్టణాలు తిరుగుతూ స్వాతంత్రోధ్యమ ఉపన్యాసాలిచ్చి, ప్రజలతో భాష విప్లవము వచ్చేందుకు కారకురాలయినది. మృదువుగా మాట్లాడుతూ, ఎంత కఠినమైన విషయాలైనా, శ్రోతల గుండెలను హత్తుకుని మరుగున ఉన్న యదార్థ స్థితిని అర్థమయ్యే విధంగా ఆమె గంభీరమైన ఉపన్యాసం శ్రోతలకు కాలం, శ్రమ తెలియనిచ్చేవి కావు. ప్రభుత్వానికి ఎదురు తిరిగి తూటా దెబ్బలకో, చీకటి కొట్లకో బలయ్యే బదులు ఈ బానిస బ్రతుకే నయమనుకుని సర్దుకుపొయ్యె అమాయక ప్రజానీకములో ఆమె ఉపన్యాసాలు దేశభక్తిని నూరి పోసి చావుకు కూడా భయపడని తెగింపును తేగలిగాయి.


Image result for sarojini naidu nightingale of india 


"జాతి వేరనీ, దేశం వేరనీ, నువ్వు వేరనీ విడిగా ఉండకు, నీకు అన్యాయం జరిగితే దేశానికి అన్యాయం జరిగినట్టే, దేశం అను భవించే బానిసత్వం నీవూ అనుభవించ వలససిన్దే" అంటూ దేశమంతా తిరిగి దేశభక్తిని నూరిపోశారామె. ఈ విశ్రాంతి లేని ప్రయాణాలతోనూ, ఉపన్యాసాలతోనూ ఆమె ఆరోగ్యం పాడైంది. 1919 సంవత్సరంలో పంజాబ్ లోని "జలియన్ వాలా బాగ్" లో అప్పటి పంజాబ్ గవర్నరైన జనరల్ డయ్యర్ లక్షలాది ప్రాణాలను తుపాకి గుండ్లకు బలిచేసి దారుణంగా హింసించి, చంపిన విషయం ఆమె లండన్ నగరంలో విన్నది. ఆ సమయానికి సరోజినీనాయుడు లండన్ నగరంలో చికిత్స పొందుతోంది. ఆమె గుండె ఆ వార్తకు నీరయిపోయింది. అప్పటికే ఆమె గుండె జబ్బుతో ఉన్నదని బాగా ముదిరిపోయినదని చెప్పారు వైద్యులు.


 Image result for sarojini naidu nightingale of india


అయినా చనిపోయే ప్రతి భారతీయుని భయంకరమైన కేకలు ఆమె చెవుల్లో గింగురుమన్నాయి. ఆమె గుండె జబ్బుకాక చని పోయిన వారి భార్యలు, కుమార్తెలు ముమారుల గుండెలు పగిలే శోకాలు తలుచుకొని ఆ కరుణామూర్తి చలించిపోయింది.

 

ఆ పరిస్థితిలో తను ఉండి కూడా ఆరోగ్యాన్ని ఏ మాత్రం లెక్క చేయక రక్త పిపాసి పంజాబ్ గవర్నర్ జనరల్ డయ్యర్ మీద ఆందోళన లేవ దీసింది. గాంధీజీకి పంజాబ్ దారుణము గురించి ఉత్తరము వ్రాస్తూ, యావత్ ప్రపంచ భారతీయులకు డయ్యర్ ద్వారా జరిగిన ఘోరాన్ని వినిపించనిదే నిద్రపోననీ వారి రాక్షస కృత్యాలకు బదులుగా భారత దేశం నుంచి వారిని తరిమి కొట్టి, భారతీయుల స్వేచ్ఛ చూడనిదే, భరతమాత ఆత్మ శాంతించదని తన సందేశము ద్వారా తెలియపరిచింది.


 Related image


సరోజిని లండన్ నగరము నుంచి బయలుదేరి సముద్ర మార్గం గుండా ప్రయాణించి, భారతదేశములో ఓడ దిగటం తోటే శాసన ధిక్కారం అమలు పరిచింది. ఆమె దేశభక్తిని, త్యాగనిరతిని మనం అర్థం చేసుకోవచ్చు. ఆ సమయంలోనె ఒక బహిరంగ సభలో ఉపన్యసిస్తూ, బ్రిటిషు పాలకులు "భారతదేశాన్ని స్వంతంగా భావించడమే అపరాధం. భారతీయుల హక్కుల గురించి బానిసలుగా చేసి వారి ప్రాణాలు సైతం బలి తీసుకోవటం క్షమించరాని అపరాధం" అంటూ ఆడపులిలా గర్జించింది.

 

లండన్ కామన్స్ సభలోని భారత దేశ మంత్రి ఆమె చేస్తున్న తిరుగు బాటు ధాటికి చలించిపోయ్యాడు. ఆమె ఉపన్యాసాలు, ఉద్వేగం సక్రమమైనవి కావనీ, ఇకపై అటువంటి ప్రచారం చెయ్య వద్దనీ, బ్రిటిష్ ప్రభుత్వం ఆమెపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చింది. తనకే రకమైన శిక్ష విధించినా యధార్థాన్ని ప్రచారం చేయక మాననని నిర్భయంగా సమాధానం చెప్పింది సరోజినీ నాయుడు. ఒక భారత స్త్రీకి దేశంపై గల ప్రేమనూ, ఆమెకు గల స్వాతంత్ర్య పిపాసనూ అర్థం చేసుకుని అప్పటి నాయకుడైన గాంధీజీ ఆనందానికి అంతులేకుండాపోయింది. ఆయన రాజద్రోహము, నేరము క్రింద ఆరేండ్లు జైలు శిక్ష ననుభవించేందుకు వెళుతూ సరోజినీనాయుడు పై గల విశ్వాసంతో, ఉద్యమనాయకత్వం ఆమెకు అప్పగించి చేతిలో చేయి వేసుకున్నారు.


Image result for sarojini naidu nightingale of india 


ఊరూరా, వాడవాడలా తిరుగుతు స్వాతంత్ర ప్రభోదం ముమ్మరంగా సాగించింది. అప్పటికే ఆమె ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంది. తన భర్త బిడ్డల యోగక్షేమాలు కూడా మాని సాటి భారతీయులంతా బిడ్డల మాదిరిభావింది పర్యటన సాగించిందా త్యాగమూర్తి. విరామ సమయాలలో దేశ ప్రజల భవిష్యత్ ను గురించి బ్రిటిష్ వారి ఘోర పరిపాలన గురించి రచనలు చేస్తూనె ఉంది. ఎక్కడున్నా, ఏదో ఒక రకంగా దేశ ప్రజలకు స్వతంత్ర ప్రభోదాలు అందజేస్తూనే ఉందావిడ. అమెరికా, కెనడా లాంటి అనేక దేశాల్లో పర్యటించి భారత దేశం పై బృఇటీష్ పీడన పర్వం పై ప్రచారంచేసింది. లండన్ లో దేశ స్వాతంత్రం కోసం రౌండ్ టేబుల్ కాన్-ఫరెన్స్ నిర్వహించారు, క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు.


Image result for sarojini naidu nightingale of india 


పురోగతినీ, స్వచ్ఛమైన స్వేచ్ఛా, స్వాతంత్ర జీవితాలను వాంచించిన కవీంద్రుడు రవీంద్రనాథ్ ఠాగూర్ మాదిరిగా స్త్రీయై ఉండి కూడా జాతి విమోచనానికి శాయశక్తులా అహోరాత్రులు కృషి చేసిన త్యాగ పూరిత మూర్తి కవయిత్రి శ్రీమతి సరోజినీ నాయుడనటంలో ఏమాత్రము సందేహం లేదు.

 

ఎందరో మహానుభావుల అచంచల దేశభక్తి, ఎడతెగని ఉద్యమ ప్రచారాల మూలంగా, 1947, ఆగస్టు 15 వ తేదీన మనం స్వాతంత్రం వచ్చాక సాధింగలిగాము. శ్రీమతి సరోజినీనాయుడు దేశానికి చేసిన సేవలు దృష్టిలో ఉంచుకుని ఆమెకు ఉత్తర ప్రదేశ్కు  గవర్నర్ గా నియమించి త్కరించడం జరిగినది. వృధాప్యంలో, అనారోగ్యంతో ఉండి కూడా ఆమె ఉత్తరప్రదేశ్ కు చేసిన సేవ, కార్యదక్షత ఎన్నటికీ మరపురానివి.


Image result for sarojini naidu nightingale of india 


"తనే దేశం, దేశమే తను" గా భావించి దేశ సేవ చేసిన అభేద భావాల మూర్తి రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక, సాహిత్య రంగా లలో రకరకాలుగా సేవలు చేసి మానవ సేవ చేయదలుచుకున్న వారికి మార్గాలనేకం అని నిరూపించిన మహా మహితాన్వితు రాలు. జీవితమంతా మానవ సేవకు, దేశసేవకూ అంకితము చేసి తన డబ్బై వ యేట 1949 మార్చి 2 వ తేదీన లక్నోలో ప్రశాంతంగా కన్ను మూసింది.

 

Image result for sarojini naidu nightingale of india 

మరింత సమాచారం తెలుసుకోండి: