ఈ మద్య చాలా మంది సోషల్ మీడియాలో చిత్ర విచిత్రమైన సంఘటనలు, తమ మనోభావాలు, పాటలు షేర్ చేస్తూ తెగ సందడి చేస్తున్నారు.   సెలబ్రెటీల నుంచి కామన్ పీపుల్స్ వరకు సోషల్ మీడియా అనేది మంచి వేధిక అవుతుంది.  ముఖ్యంగా కొన్ని కామెడీ సీన్లు, పాటలు చూస్తుంటే నవ్వు ఆపుకోవడం కష్టంగానే ఉంటుంది.  ముఖ్యంగా యూట్యూబ్ వచ్చినప్పటి నుంచి ఇలాంటి వాటికి ఎక్కువగా ప్రియార్టీ ఇస్తున్నారు.  తాజాగా కొంత మంది అమ్మాయిలు తన బాయ్ ఫ్రెండ్ పై వ్యంగంగా పాడిన పాట ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది.  

కొంత మంది ఔత్సాహిక కళాకారులు కూడా మంచి క్రియేటివిటితో పాటలు, సంగీతం, డైలాగ్స్ తో తన ప్రతిభను పది మందికీ చూపిస్తున్నారు.  అలాంటి కోవలోకే వస్తుంది..ఈ అమ్మాయిలు పాడిన పాట.  ‘సోనూ నామీద భరోసా లేదా..?!!’అంటూ వెటకారంగా ఓ వీడియో సాంగ్ ను అప్ లోడ్ చేశారు.  గత కొంత కాలంగా హాలీవుడ్, బాలీవుడ్ లో ఇలాంటి పాటలు పెడుతూ సోషల్ మీడియాలో సందడి చేస్తున్న విషయం తెలిసిందే.

తాజాగా తెలుగు లో కూడా కొంత మంది అమ్మాయిలు  ‘సోనూ నామీద భరోసా లేదా..?!!’ పాట పాడుతూ..కడుపుబ్బా నవ్వించారు. ఆ వీడియో ఫేస్ బుక్, ట్విట్టర్, యూట్యూబ్, వాట్సప్ లలో మస్త్ షేర్లవుతూ తెగ కామెడీ పుట్టిస్తోంది. ఇంకేముంది ఈ వీడియో లక్షల వ్యూస్ తో దూసుకుపోతోంది. గతంలో హీరో ధనుష్ పాడిన పాట ‘వై దిస్ కొలవెరి’ మాదిరి ఆ వీడియోకు ఎన్నో ట్రోల్స్ వస్తున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: