ఆంధ్ర ప్రదేశ్ అభివృద్దే శ్వాసగా అమరావతి నిర్మాణమే జీవితాశయంగా నిరంతరం శ్రమించే ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుణ్ణి ప్రతిష్టాత్మక "గొల్డెన్ పీకాక్ లీడర్-షిప్ అవార్డు" వరించింది. ఈ అవార్డ్ ప్రధానోత్సవం దీన్ని ఆయన పబ్లిక్ సర్వీస్ అండ్ ఎకనామిక్ ట్రాన్సఫర్మేషన్ విభాగంలో చంద్రబాబుకు బ్రిటన్ మంత్రి ప్రీతి పటేల్ చేతుల మీదుగా లండన్‌లో అందజేశారు.  ఏపీ అభివృద్ధిలో భాగస్వాములు అవ్వాలని, పెట్టుపడులతో రాష్ట్రానికి రావాలని పారిశ్రామిక వేత్తలను ఆహ్వానించారు.


Image result for golden peacock leadership award to chandrababu

 
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సతీమణి, హెరిటేజ్ సంస్థ వైస్ చైర్మన్ మరియు మానేజింగ్ డైరెక్టర్  నారా భువనేశ్వరి గారికి, విజవంతమైన ఎంట్రప్రీన్యూర్ గా సత్కరిస్తూ అదే వేదికపై  "కార్పొరేట్ గవర్నెన్స్ ఇన్ పబ్లిక్ సెక్టార్"  విభాగంలో  "గోల్డెన్ పీకాక్ అవార్డు" ప్రధానం చేశారు. ముఖ్యమంత్రి గురించి సభికులకు పరిచయం చేస్తూ భారత దేశ ప్రధాని అయ్యేందుకు చంద్రబాబు అన్ని అర్హతలు ఉన్నాయని నిర్వాహకులు అంటే చంద్రబాబు చెప్పిన మాటలు సభలో వినమ్రత తో పలికిన ఈ కొద్ది మాటలు అందరి పెదవులపై చిరునవ్వులు జల్లులు కురిపించాయి. 


Image result for golden peacock award to bhuvanesvari



 తానో చిన్న పార్టీకి అధ్యక్షుడినని, తన పరిమితులు ఏంటో తనకు తెలుసని, ప్రధాని పదవికి పోటీ తాను కానేకాదని, ఆన్ ధ్రప్రదేశ్ ను ఆదర్శ రాష్ట్రంగా తీర్చి దిద్దడమే తన ధ్యేయమన్నారు. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ గోల్డెన్ పీకాక్ అవార్డు అందించడం ద్వారా అటు ప్రజాసేవలో ఇటు కార్పొరేట్ రంగంలో గొప్ప నాయకులను గుర్తించి ప్రోత్సహిస్తోందని చంద్రబాబు అన్నారు. భారత్ అత్యంత శక్తివంతమైన దేశం అన్న ఆయన ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని, పెట్టుబడులతో రావాలని బ్రిటన్ పారిశ్రామికవేత్తలను, ఎన్.ఆర్.ఐ లను ఆహ్వానించారు. అమరావతి అభివృద్దిలో కూడా బాగస్వాములు కావాలని కోరారు.


Related image


వ్యూహాత్మకంగా పావులు కదపటం, అనుకున్న పనులు శరవేగంగా చేయించి ముగించటం చంద్రబాబుకు కరతలామలకం. ఈ సామర్ధ్యాన్నే మెచ్చి ఆయనకు గోల్డెన్ పీకాక్ లీడర్షిప్ అవార్ద్ లండన్ లో బహూకరించారు.  ఇది ఆయనకు ఎనలేని గుర్తింపనే చెప్పాలి. అయితే ఆయనలోని ఉత్సాహానికి మరింత ప్రోత్సాహమిచ్చే విషయంగా భావించవచ్చు. 


Related image

మరింత సమాచారం తెలుసుకోండి: