తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాద్ ని విశ్వనగరంగా మారుస్తామని ప్రభుత్వం ప్రకటిస్తుంది. మరోవైపు ఇక్కడ నేర సామ్రాజ్యం విచ్చలవిడిగా విస్తరిస్తుంది.  ఆ మద్య డ్రగ్స్ కేసులో ఎన్నో దారుణమైన విషయాలు బయటకు వచ్చాయి.  ప్రతిరోజు ఎక్కడో అక్కడ నేరాగాళ్లు రెచ్చిపోతూనే ఉన్నారు.  డ్రగ్స్, హైటెక్ వ్యభిచారం, అక్రమ ఆయుధాలు, చైన్ స్నాచింగ్స్ తో హైదరబాద్ ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. అంతే కాదు ఈ మద్య తుపాకీ కాల్పులు కూడా బాగానే వినిపిస్తున్నాయి.
Image result for hyderabad drugs
తాజాగా హైదరాబాద్ శివార్లలోని మైలార్ దేవ్ పల్లిలో తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. కింగ్స్ కాలనీలో నివాసం ఉంటున్న ముస్తఫా అనే యువకుడిపై జుబేద్ అనే వ్యక్తి కాల్పులకు తెగబడ్డాడు.  పాతబస్తీకి చెందిన జుబేర్‌ అనే వ్యక్తి ముస్తఫాను బర్త్‌డే పార్టీ పేరిట ఫామ్‌హౌస్‌కు పిలిచాడు. ఈ సందర్భంగా వీరి మధ్య నడుస్తున్న భూవివాదంపై గొడవ జరిగింది. దీంతో జుబేర్‌ తన వద్ద ఉన్న లైసెన్స్‌డ్‌ రివాల్వర్‌తో ముస్తఫాపై కాల్పులు జరిపాడు.
Image result for hyderabad firing
ముస్తఫా ఛాతిలోకి రెండు బుల్లెట్లు దూసుకెళ్లాయి. ప్రస్తుతం బంజారాహిల్స్‌లోని విరించి ఆస్పత్రిలో అతను చికిత్స పొందుతున్నారు. జుబేద్ వాడిన తుపాకీకి లైసెన్స్ ఉందని పోలీసులు గుర్తించారు. అయితే, ఇతనికి నేర చరిత్ర కూడా ఉందని పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: