గుజరాత్, హిమాచల్ ఎన్నికల తర్వాత బీజేపీ తదుపరి గురి... కర్ణాటక బరి. దక్షిణ భారతంలో కాంగ్రెస్‌కు ఎంతో కీలకమైన ఈ చివరి కోటపై దండయాత్రకు మోదీ సేన సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది ఏప్రిల్-మేలో కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా అధికార, ప్రతిపక్షాల చూపు ఇప్పుడు ఇటు షిఫ్ట్ అయింది. ఇంతకు ముందు దక్షిణ భారతంలోనే తొలిసారిగా కర్ణాటకలో ప్రజలు బీజేపీకి పట్టంగట్టారు. కానీ, రాష్ట్ర నేతలు పరస్పరం కలబడి ‘కమలం’లో పెట్టి మరీ కాంగ్రెస్‌కు అధికారం అప్పగించారన్న ఆవేదన కార్యకర్తల మదినుంచి ఇంకా చెరిగిపోలేదు.

ఈ నేపథ్యంలో ప్రస్తుత ప్రధానమంత్రి మోదీ టనేతృత్వంలో పటిష్ఠ వ్యూహరచనకు రాష్ట్ర బీజేపీ సిద్ధమైంది.   ప్రస్తుతం కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా దానిని కూడా తమ వశం చేసుకుని కాంగ్రెస్‌ ‘చేతి’ నుంచి మరో రాష్ట్రాన్ని లాగేసుకోవాలని బీజేపీ ఇప్పటి నుంచే ప్లాన్లు వేస్తోంది. వాస్తవానికి గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రకటనకు ముందునుంచే అధికార కాంగ్రెస్, విపక్ష బీజేపీలు 2018 ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టేశాయి. గుజరాత్ తరహాలో కర్ణాటకలోనూ నెట్టుకొచ్చేసే పరిస్థితి ఇప్పటికైతే బీజేపీకి లేదన్నది విశ్లేషకుల మాట.

ఆ మేరక ఉఈ రాష్ట్రంలో ఎన్నికలు అటు ప్రధాని మోదీ ప్రజాదరణకు, ఇటు రాహుల్‌గాంధీ చతురతకు కఠిన పరీక్షే అనడంలో సందేహం లేదు.కర్ణాటకలో మొత్తం 224 స్థానాలుండగా కాంగ్రెస్ చేతిలో 127 స్థానాలున్నాయి. సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఉన్నారు. గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ ఫలితాలు ఇచ్చిన ఊపుతో ఉన్న బీజేపీ ‘కాంగ్రెస్ ముక్త భారత్’ తప్పదని ధీమా వ్యక్తం చేస్తోంది.అన్ని రాష్ట్రాల్లో లాగా మోదీ మ్యాజిక్ ఇక్కడ పనిచేయదని సీఎం సిద్ధరామయ్య తేల్చి చెప్పారు.

సిద్ధరామయ్య ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతే తమను గెలిపిస్తుందని బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి యడ్యూరప్ప చెబుతున్నారు. బీజేపీ రాష్ట్రశాఖ అధ్య క్షుడు, మాజీ సీఎం యడ్యూరప్పను ఈసారి ఎన్నికలలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా అంగీకరించేందుకు ఇతర నేతలు సిద్ధంగా లేరు. ఈ నేపథ్యంలో మోదీ, అమిత్ షా ద్వయం ఏదో ఒక అద్భుతం చేయకపోదని వారు విశ్వసిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: