భారతీయ చలన చిత్ర రంగంలో విలక్షన నటుడిగా పేరు తెచ్చుకున్న ప్రకాశ్ రాజ్ ఇప్పటి వరకు పలు భాషల్లో నటించారు.  తెలుగు, తమిళ ఇండస్ట్రీలో ప్రకాశ్ రాజ్ నటనకు ఫిదా అయ్యేవారు ఎంతో మంది ఉన్నారు.  ఈ మద్య ప్రకాశ్ రాజ్ సినిమాల కన్నా రాజకీయ వ్యాఖ్యలు ఎక్కువ చేస్తున్నారు.  తాజాగా 
తనను పదేపదే రెచ్చగొట్ట వద్దని, అలా చేస్తే రాజకీయాల్లోకి వస్తానని ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ అన్నాడు. రాజకీయాలంటే తనకు ఏమాత్రం ఆసక్తి లేదని, అవి చాలా కష్టమైనవని, అయితే ఊరికనే రెచ్చగొడితే మాత్రం రాజకీయాల్లోకి వస్తానని అన్నాడు. 
Image result for gouri lankesh
బెంగళూరులో  ప్రెస్ క్లబ్ ఆఫ్ బెంగళూరు నుంచి 2017 సంవత్సరానికి గాను ‘ఉత్తమ వ్యక్తి’ అవార్డు అందుకున్న అనంతరం ప్రకాశ్ రాజ్ మీడియాతో మాట్లాడాడు. లంకేశ్ హత్య విషయంలో కేంద్రం ఉదాసీనంగా వ్యవహరిస్తోందంటూ బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించాడు. ఆ తర్వాత అడపాదడపా ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే ఉన్నాడు. ప్రకాశ్ రాజ్ ఇటీవల రాజకీయాల గురించి తరచూ మాట్లాడుతున్నాడు.
Image result for gauri lankesh prakash
బెంగళూరులో ప్రముఖ జర్నలిస్టు గౌరీ లంకేశ్ హత్య తర్వాత రాజకీయాలు ఎలా జరిగాయో ఆయన విమర్శించారు. ఇటీవల జరిగిన గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన తర్వాత ప్రధాని మోదీకి శుభాకాంక్షలు చెబుతూనే.. ‘ఈ విజయంతో మీరు నిజంగా హ్యాపీగా ఉన్నారా?’ అని ప్రకాశ్ రాజ్ ప్రశ్నించాడు.బెంగళూరును బెందకాళూరు అని కూడా పిలుస్తారని, శాంతికి భంగం కలిగించి అశాంతి సృష్టించాలనుకునే వారి వ్యాఖ్యలు ఇక్కడ సాగవని హెచ్చరించారు.  ఆ తర్వాత అడపాదడపా ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే ఉన్నాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: