బొగ్గు గనుల కేటాయింపులో అప్పటి ఝార్ఖండ్ ముఖ్యమంత్రి మధుకొడా, మరికొందరు ప్రభుత్వ ఉన్నతాధికారులు విని ఐరన్‌ కంపెనీకి అనుకూలంగా వ్యవహరించి అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపిస్తూ సీబీఐ కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన విషయం తెలిసిందే.  సంచలనం సృష్టించిన బొగ్గు గనుల కేటాయింపు కుంభకోణం కేసులో ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధు కొడాను దోషిగా తేల్చింది సీబీఐ ప్రత్యేక కోర్టు. ఈ కుంభకోణంలో మధు కొడా అవినీతికి పాల్పడినట్లు రుజువైందని కోర్టు స్పష్టం చేసింది. 
Image result for మధుకొడా
పారదర్శకంగా వేలం నిర్వహించలేదని, దీనివల్ల వేల కోట్ల రూపాయాల అక్రమాలు జరిగాయని పేర్కొంది. దీనిపై విచారణ చేపట్టిన సీబీఐ ప్రత్యేక కోర్టు మధుకొడా సహా మరో ఏడుగురిని దోషులుగా తేలుస్తూ తీర్పును తెలిపింది.  తాజాగా జార్ఖండ్ మాజీ సీఎం మధుకొడాకు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. బొగ్గు కుంభకోణం కేసులో సీబీఐ కోర్టు విధించిన శిక్షపై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది. ఆయనకు విధించిన 25 లక్షల రూపాయల జరిమానాపై కూడా కోర్టు స్టే విధించింది. ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 22కు వాయిదా వేసింది.   
Image result for coal scam
సీబీఐ ప్రత్యేక కోర్టు మధుకొడా సహా మరో ఏడుగురిని దోషులుగా తేలుస్తూ తీర్పును తెలిపింది.  మధుకోడాతో పాటు మరికొందరిని సీబీఐ స్పెషల్ కోర్టు దోషులుగా నిర్ధారించి, శిక్షలు ఖరారు చేసింది. అయితే సీబీఐ కోర్టు తీర్పును ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేశారు మధు కోడా. సీబీఐ కోర్టు తీర్పుపై స్టే విధించిన ఢిల్లీ హైకోర్టు, జనవరి 18 వరకు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: