ప్రముఖ లిక్కర్‌ వ్యాపారి  ఓల్డ్ మాంక్ సృష్టికర్త బ్రిగేడియర్ కపిల్ మోహన్(88) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ నెల 6న ఆయన గజియాబాద్‌కు సమీపంలోని మోహన్ నగర్‌లో తుదిశ్వాస విడిచారు. ఆ వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  స్వ‌త‌హాగా ఎలాంటి మ‌ద్యం తీసుకోని క‌పిల్ మోహ‌న్ లిక్కర్‌ కింగ్‌గా ప్రాచుర్యం పొందినప్పటికీ.. చక్కెర, వస్త్ర పరిశ్రమలను కూడా విజయవంతంగా ముందుకు నడిపించారు. బ్రిగేడియర్ కపిల్ నాలుగవ అత్యుత్తమ పౌర సన్మానం పద్మశ్రీ అందుకున్నారు.
ఓల్డ్ మంక్ సృష్టికర్త కన్నుమూత
మోహన్ మేకిన్ లిమిటెడ్ సంస్థ మాజీ చైర్మన్, ఎండీ కిపల్ మోహన్.. ఓల్డ్ మంక్ మద్యం తయారు చేశారు.  1954లో మొదటిసారి ఆయన వనిలా ఫ్లేవర్‌తో ఓల్డ్ మంక్ రమ్‌ను లాంచ్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఈ రమ్ చాన్నాళ్లు అత్యధికంగా అమ్ముడుపోయింది.  ఓల్డ్ మాంక్‌తో పాటు సోలాన్‌ నెం.1, గోల్డెన్ ఈగ‌ల్ వంటి మ‌రో రెండు బ్రాండుల‌ను కూడా ఆయ‌న సృష్టించారు.
Kapil Mohan man behind Old Monk Passes Away - Sakshi
‘డార్క్‌ రమ్‌’గా ఓల్డ్‌ మంక్‌ అమ్మకాలు కొన్నేళ్లపాటు జోరుగా సాగాయి. వ్యాపార, వాణిజ్య రంగాల్లో ఆయన అందించిన సేవలకుగాను భారత ప్రభుత్వం 2010లో దేశ నాలుగో అత్యున్నత పౌరపురస్కారమైన ‘పద్మశ్రీ’ని ఇచ్చి గౌరవించింది. 2000లలో ఆర్మీ క్యాంటీన్లలో అత్యధికంగా విక్రమయ్యే మద్యం బ్రాండ్‌గా ఓల్డ్ మాంక్‌కు గుర్తింపు ఉండేది.
Image result for ఓల్డ్ మంక్
ఆ సంస్థ దాదాపు రూ.400 కోట్ల టర్నోవర్ సాధించింది. ఆయన అనారోగ్యం బారిన పడటంతో వ్యాపారాన్ని బంధువులకు అప్పగించేశారు. గత కొంత కాలంగా ఓల్డ్‌ మంక్‌ నష్టాల్లో కొట్టుమిట్టాడుతుందన్న వార్తలు వినిపిస్తున్నాయి.కపిల్ మోహన్ మృతి పట్ల ఓల్డ్ మంక్ ప్రియులు, సోషల్ మీడియా యూజర్లు నివాళి అర్పించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: