ఏపీ చంద్రబాబు  తాజాగా ఓ కార్యక్రమం ప్రారంభించారు. దళితులకు ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను వివరించడమే దాని ఉద్దేశ్యం.. ఆ కార్యక్రమం పేరు.. దళిత జ్యోతి చంద్రన్న ముందడుగు.. దళితులను అన్ని విధాలుగా ఆదుకోవడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందన్న చంద్రబాబు.. వారు సమాజంలో అట్టడుగున నిలవరాదని, అగ్రకుల స్థాయికి వారు ఎదగాలని చెప్పుకొచ్చారు. అంబేడ్కర్‌ ఆశయాల స్పూర్తితో చంద్రన్న ముందడుగు కార్యక్రమం చేపట్టామని వివరించారు.

chandranna కోసం చిత్ర ఫలితం
దళితులకు అండగా నిలవడం వరకూ బాగానే ఉంది. దళితుల కార్యక్రమానికి కూడా చంద్రన్న పేరు పెట్టడం ఆశ్చర్యపరుస్తోంది. దళితుల్లో దేశవ్యాప్తంగా పేరున్న నేతలెందరో ఉన్నారు. పోనీ.. ఏపీలోనే ఎందరో దళిత నేతలు ఉన్నారు. వారి పేర్లు పెట్టకుండా దీనికి కూడా చంద్రన్న పేరు పెట్టడం వివాదాలకూ తావిస్తోంది. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అనేక ప్రభుత్వ కార్యక్రమాలకు ఇందిర, రాజీవ్ పేర్లు పెట్టారు. ఈ ఇద్దరి పేర్లూ లేకుండా ఏ కార్యక్రమం కూడా ఉండేదికాదు. 


chandranna కోసం చిత్ర ఫలితం
అప్పట్లో కాంగ్రెస్ సర్కారు తీరును  తెలుగుదేశం తప్పుబట్టింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం మొదట్లో ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలకు ఎన్టీఆర్ పేరు పెట్టేది. ఆ తర్వాత ఒక్కసారిగా ట్రెండ్ మార్చేసింది. ఎన్టీఆర్ పేరు కాకుండా ఏకంగా సీఎం చంద్రబాబు పేరుతోనే ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. చంద్రన్న భీమా, చంద్రన్న కానుక, చంద్రన్న విలేజ్ మాల్స్.. అంటూ కొత్త రాగం అందుకుంటున్నారు. 

chandranna కోసం చిత్ర ఫలితం

అసలు చంద్రబాబును చంద్రన్న అంటూ ఎవరకూ పిలవరు. అన్న అనే పిలుపు ఒక్క ఎన్టీఆర్ కే సూట్ అయ్యింది. చంద్రన్న అంటూ ఎన్టీఆర్ తరహాలో కీర్తి సంపాదించాలని చంద్రబాబు తాపత్రయపడుతున్నట్టు ఈ కొత్త ట్రెండ్ ద్వారా అర్థమవుతోంది. ఇది చంద్రబాబు బుర్రకు తట్టిన ఆలోచనో లేక.. ఆయన చుట్టూ చేరిన భజన పరులు ఆలోచనో తెలియదు కానీ.. ఇలా ప్రతి కార్యక్రమానికి చంద్రన్నపేరు తగిలిస్తే.. అతి కాస్తా వికటించే ప్రమాదం లేకపోలేదు. 



మరింత సమాచారం తెలుసుకోండి: