మొన్న.. సంపూర్ణ చంద్రగ్రహణం... దాదాపు 150 తర్వాత వచ్చిన అరుదైన ముహూర్తం.. చంద్రడు సూపర్ మూన్ అంటే చంద్రుడు పెద్ద సైజులో..భూమికి దగ్గరగా కనిపించాడు.బ్లూ మూన్.. ఒకే నెలలో రెండో సారి పున్నమి వస్తే దాన్ని బ్లూ మూన్ అంటారు. ఇంకో విశేషం.. బ్లడ్ మూన్ అంటే.. గ్రహణ సమయంలో భూమి నీడ చంద్రుడిపై పడుతుంది.అప్పుడు చంద్రుడు ఎరుపు వర్ణంలో మెరుస్తాడు.

Image result for బాలుడి నరబలి

ఇన్ని విశేషాలు ఉన్న వేళ హైదరాబాద్ లో ఓ అరాచకం జరిగింది. 3 నెలల పసిపాపను కిరాతకంగా హత్య చేశారు. తలను వేరు చేసి ఓ భవనంపై వేశారు. హైదరాబాద్‌ శివారులోని భవనం మీద మీద చిన్నారి తల లభ్యం కావడం కలకలం రేపింది. ఉప్పల్‌ చిలకానగర్‌ లో జరిగిన ఈ ఘటనపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చిలకానగర్‌లో నివసించే క్యాబ్‌ డ్రైవర్‌ రాజశేఖర్‌ ఇంటి డాబాపైన బట్టలు ఆరవేయడానికి వెళ్లిన అతని అత్త అక్కడ చిన్నారి తల పడి ఉండడం గమనించి కుటుంబసభ్యులకు తెలిపింది.

Image result for బాలుడి నరబలి

రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ ప్రారంభించారు. జాగిలాలతో క్షుణంగా పరిసరాల్లో గాలించారు. అయితే జాగిలాల...తల లభించిన ఇంటి పక్కన నివాసముండే నరహరి ఇంట్లోకి వెళ్లాయి. రెండుసార్లు కూడా జాగిలాల ఆ ఇంట్లోకి వెళ్లి తచ్చాడాయి. దీంతో పోలీసులు నరహరిని అదుపులోకి తీసుకున్నారు. రాజశేఖర్‌ను కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Image result for chandra grahan

క్షుద్ర పూజలేమైనా జరిగాయా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. నిన్న చంద్రగ్రహణం కావడంతో క్షుద్ర పూజలు చేసి చిన్నారిని బలి ఇచ్చారా అనే అనుమానాలు స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఈ కోణంలోనూ దర్యాప్తు జరుపుతున్నారు. అసలు భవనం పై కప్పు మీద లభించిన చిన్నారి తల ఎవరిది అనే విషయం ఇంకా తేలలేదు. దీనిపై కూడా లోతుగా పోలీసులు ఆరా తీస్తున్నారు. నరహరి గురించి క్షుణ్ణంగా విచారణ జరుపుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: