గత కొంత కాలంగా తెలంగాణలో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల మద్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది.  ప్రస్తుతం కాంగ్రెస్ బస్సు యాత్ర మొదలు పెట్టిన నేపథ్యంలో కేటీఆర్ పలు విమర్శలు చేశారు. జానా ఓ ఆలిబాబాగా..మిగతా నేతలు దొంగలు అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.  దీనిపై ఇప్పుడు కాంగ్రెస్ కారాలు మిర్యాలు నూరుతుంది..జానారెడ్డి మంత్రి కేటీఆర్ కి వార్నింగ్ కూడా ఇచ్చారు.  ఇదిలా ఉంటే..ఆ మద్య ఓ బహిరంగ సభలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రంపై పలు విమర్శలు చేశారు. అంతే కాదు ప్రధాని మోదీపై అనుచిత వాఖ్యలు కూడా చేశారు. దీంతో ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కేసీఆర్ పై బీజేపీ నేతలు భగ్గుమంటున్నారు.
Image result for trs
తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను దద్దమ్మ అంటూ కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ ధ్వజమెత్తారు. లక్షన్నర కోట్ల రాష్ట్ర బడ్జెట్ లో వ్యవసాయానికి రూ. 10 వేల కోట్లు కూడా కేటాయించలేని దద్దమ్మలు కేంద్ర ప్రభుత్వాన్నే ప్రశ్నిస్తారా? అంటూ విరుచుకుపడ్డారు. దేశంలో రైతన్నల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని... అలాంటి బీజేపీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీతో పోలుస్తారా? అంటూ మండిపడ్డారు. 
Image result for modi
తెలంగాణ ప్రభుత్వానికి అధికార పార్టీ చేసింది ఏమీ లేదని..మోస పూరిత మాటలతో పబ్బం గడుపుతున్నారని విమర్శించారు. కేసీఆర్ కపట రాజకీయాలను చూసి అందరూ విస్తుపోతున్నారని దత్తాత్రేయ అన్నారు. వ్యవసాయం పేరిట కేంద్ర ప్రభుత్వంపై బురదజల్లే విధంగా కేసీఆర్ రాజకీయాలు ఉన్నాయని... తెలంగాణ రైతులు వాస్తవాలను గ్రహిస్తున్నారని చెప్పారు.  ముఖ్యమంత్రి హోదాలో ఉండి..ఇలాంటి దిగజారుడు మాటలు మాట్లాడితే ఆయనకే నష్టం అని సూచించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: