ఈ మద్య ప్రపంచంలో టెక్నాలజీ బాగా డెవలప్ అయ్యింది..అయితే దీంతో అవసరాలు ఎన్ని ఉన్నాయో అదే రేంజ్ లో అనర్థాలు కూడా అన్నే ఉన్నాయి.   వాస్తవానికి టెక్నాలజీ మంచికోసం ఉపయోగిస్తే..అంతా మంచే జరుగుతుంది..కానీ కొంత మంది అనర్ధాలకు వాడుతూ ఎంతో మంది జీవితాలు నాశనం చేస్తున్నారు.  ముఖ్యంగా సోషల్ మాద్యమాలు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ చాటింగ్స్, వీడియో కాల్స్ తో బిజీ బిజీగా మారిపోయారు.  ఇలాంటి సమయాల్లో కొంత మంది కేటుగాళ్లు అమ్మాయిలకు, మహిళలకు వలవేసి వారికి మాయబాటలు చెప్పి లోబర్చుకొని తర్వాత బెదిరింపులకు తెగబడుతున్నారు.
Image result for facebook chating womens
తాజాగా ఓ మహిళ ఫేస్ బుక్ ద్వారా పరిచయం అయిన వ్యక్తి ట్రాప్ లో పడి తన నగ్న చిత్రాలు పంపించి చిక్కులు కొని తెచ్చుకుంది. వివరాల్లోకి వెళితే..టోలిచౌకికి చెందిన ఓ వివాహిత కొన్నాళ్ల క్రితం ఫేస్‌బుక్‌ ఖాతా తెరిచింది. ఆమె భర్త జీవనోపాధి రీత్యా దుబాయ్ వెళ్లాడు. తన భర్తతో ఫేస్ బుక్ ద్వారా  చిట్ చాట్ చేస్తూ సంతోషంగా ఉంది..ఇదే సమయంలో ఆమెకు మరికొంత మందితో చాటింగ్ చేస్తూ ఉండేది.  ఈ సమయంలో ఆమెకు జుబేర్ అనే వక్తి పరిచయం కావడంతో కొద్దిరోజులకు వారి మద్య సాన్నిహిత్యం బాగా పెరిగిపోయింది..వారి పర్సనల్ లైఫ్ గురించి కూడా చర్చించుకోవడం తో ఆమె వీక్ నెస్ మొత్తం తెలుసుకున్న జుబేర్ చిన్నగా బెదిరింపులకు పాల్పడ్డాడు.
Image result for నగ్న చిత్రాలు
అంతే కాదు ఆమె నగ్న ఫోటోలు పంపించాలని ఆర్డర్ వేశాడు..లేదంటే అప్పటి వరకు తమ మద్య ఉన్న బాగోతం తన భర్తకు షేర్ చేస్తానని బెదిరించాడు. దీంతో భయపడి ఆమె నగ్న ఫోటోలు పంపింది. క్కడి నుంచి ఆమెకు మరిన్ని కష్టాలు మొదలయ్యాయి. ఆ ఫోటోలను జుబేర్ మరో ఇద్దరికి షేర్ చేయడంతో.. వారు కూడా ఆమెపై కన్నేశారు.జుబేర్ నుంచి ఫోటోలు షేర్ చేసుకున్న ఆ ఇద్దరూ.. ఆమెకు పరిచయస్తులే కావడం మరింత ఇబ్బంది కలిగించింది.  వారు కూడా బెదిరించడం మొదలు పెట్టడంతో..అసలు తన ఫేస్ బుక్ ఖాతాను క్లోజ్ చేసుకుంటే సమస్యలు పోతాయని భావించి..సమీర్ ఖాన్ అనే ఓ స్నేహితుడి సహాయం కోరగా.. అతనూ ఆమె వంచించాడు. ఆమె నుంచి యూజర్ ఐడీ, పాస్ వర్డ్ తీసుకుని.. ఆమె చాటింగ్స్ లో ఉన్న డేటా మొత్తం కలెక్ట్ చేసుకున్నాడు.
Image result for jail
ఇక సమీర్ ఖాన్ మరో అడుగు ముందుకు వేసి ఆమె నగ్న చిత్రాలు కూడా ఉండటంతో.. వాటిని ఆమె భర్తకు పంపించి డబ్బు కోసం డిమాండ్ చేశాడు. దుబాయ్ నుంచి ల్యాప్‌టాప్, పెన్‌డ్రైవ్, రూ.5 వేల నగదు పంపించకపోతే... వీటిని సోషల్ మీడియాలో పెడుతానంటూ అతను బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. 
Related image
విషయం అంతా తెలుసుకొని ఆమె భర్త దుబాయ్ నుంచి వచ్చి వివరాలు అన్ని తెలుసుకొని సిటీ సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో జుబేర్ సహా మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ట్విస్ట్ ఏంటేంటే.. నిందితుల్లో ఒకడైన సమీర్ ఖాన్ అనే వ్యక్తి దివ్యాంగుడు కావడంతో అతన్ని రిమాండ్‌కు తరలించలేదని పోలీసులు తెలిపారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: