విభజనతో సమస్యలతో ఉన్న ఆంధ్రప్రదేశ్ ను ఒడ్డునపడేయడంలో చంద్రబాబు వైఫల్యం చెందారా.. చంద్రబాబు అసమర్థత కారణంగానే ఆంధ్రప్రదేశ్ తన హక్కులను కాపాడుకోలేకపోతోంది. ఆయన స్వయంకృపరాథాలవల్లనే వచ్చే ఎన్నికల్లో తీవ్ర అసంతృప్తిని ఎదుర్కోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఎన్డీఏ నుంచి బయటకు రావడం కూడా అందులో భాగమేనా.. ఇప్పుడీ ప్రశ్నలు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి.



ఎన్డీఏ నుంచి బయటకు వెళ్లిపోవడంపై ఆ పార్టీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు విభిన్నంగా స్పందించారు. చంద్రబాబు బయటకు వెళ్లిపోవడం ఆయన సమర్థతను తెలియజేస్తుందన్నారు. ఢిల్లీకి 29 సార్లు వెళ్లినా తాను పనులు చేయించుకోలేకపోయానంటూ చంద్రబాబు తన అసమర్థతను బయట పెట్టుకుంటున్నారంటూ కౌంటర్ వేసారు. 


అంతే కాదు.. చంద్రబాబు తన అసమర్థతను ప్రచారం చేసుకుంటున్నారని బీజేపీ ఎద్దేవా చేస్తోంది. తన అసమర్థతను తానే బయటపెట్టుకుంటున్నారని.. ఇలాంటి అసమర్థ ముఖ్యమంత్రి పట్ల ప్రజలు కూడా సరైన నిర్ణయమే తీసుకుంటారని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు అవకాశాలు లేకపోవడం వల్లే చంద్రబాబు తన తప్పిదాలను, వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్నది బీజేపీ వాదనగా ఉంది.



చంద్రబాబు ప్రభుత్వం కేంద్రం అన్నివిధాలుగా సాయపడుతున్నా.. బీజేపీపై దండెత్తడం ద్వారా తన పాలనపై ఉన్న అసంతృప్తిని అధిగమించాలని ప్రయత్నిస్తున్నారని బీజేపీ వాదిస్తోంది. మరి బీజేపీ వాదనలో బలం ఎంత.. జనం చంద్రబాబు పాలనపై ఎలాంటి తీర్పు ఇవ్వబోతారు.. ఈ ప్రశ్నలకు సమాధానం త్వరలోనే తెలుస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: