కర్ణాటక ఎన్నికలు దక్షిణ భారతాన బాజపా రాజకీయ ప్రవేశానికి సింహద్వారమే. అంతే కాదు "కాంగ్రెస్ ఫ్రీ భారత్ - కాంగ్రెస్ ముక్త భారత్" అనే బాజపా ఆకాంక్షలకు ఒక సవాల్. అలాగే దేశ మంతా బాజపా ప్రభంజనంతో ఒక్కో రాష్ట్రాన్ని ఎన్నికల్లో ఓడిపోతూ అధికారాన్ని కోల్పోతూ వస్తున్న కాంగ్రెస్ కొడిగట్టిన దీపంలాగా మనుటయా? మరణించుటయా? అన్నట్లుంది. కర్ణాటకను దక్కించుకోలేకపోతే కాంగ్రెస్ భవితవ్యం దేశములో సమాప్తం సంపూర్ణం అని చెప్పొచ్చు. అందుకే కర్ణాటక ముఖ్యమంత్రి వ్యూహాలు బాజపాకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. బాజపాకి ఏమాత్రం తగ్గని వ్యూహాలతో సిద్ధరామయ్య బరిలో నువ్వా? నెనా?  అన్నంతగా సవాల్ విసురుతున్నారు బాజపా అగ్రనాయకత్వం నరెంద్ర మోడీ అమిత్ షా లకు. 

Image result for narendra modi amith shah rahul gandhi

ఈ పరిస్థితుల్లో కర్ణాటక ఎన్నికల బరిలో సమ ఉజ్జీలుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ అధికారం నిలుపుకోవటానికి, అధికారం దక్కించుకొని కాంగ్రెస్ కు చెక్ పెట్టటానికి బాజపా తమ చతురంగ బలాలను ఎన్నికల కురుక్షేత్రంలో మొహరించాయి. అంతేకాదు ఉత్తర ప్రదేశ్ ఉప ఎన్నికల్లో బాజపా పొందిన పరాభవానికి కర్ణాటకలో ప్రాభవం ప్రదర్శించటం దానికి అత్యంత అవసరం.

Image result for bjp congress in karnaTaka

అన్నీ భారత రాష్ట్రాల్లోలాగే కర్ణాటకలో కూడా కుల జాఢ్యం తారస్థాయికి చేరుతూ ఉంది. అన్నీ పార్టీఅలకు ఇక్కడ కుల సమతుల్యత వారి వారి స్థాయికి తగ్గట్టే ఉంది. ఒకరిని తియ్యారాదు, ఇంకొకరిని పెట్టరాదన్నట్లు. ఎవరికి వారి బలమైన కుల నేపధ్యం ఉంది. అందుకే ఎన్నికల సమరాంగణంలో ప్రత్యర్ధుల గెలుపు గుఱించి చెప్పటం అంత శాస్త్రీయం కాదు.

Image result for bjp congress in karnaTaka

కాంగ్రెస్ కు ఉండే యాంటీ ఇన్-కంబెన్సీ దానికి సహజ ఇబ్బంది. కులంపై విసుగెత్తి ఉన్న కర్ణాటక పౌరులు, ఇతర రాష్ట్రాల మూలాలున్న వారు కాంగ్రెస్కు ఓటు చేయరు. కర్ణాటకలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక పార్టీ విజయావకాశాలను నిర్ణయించే కీలాకాంశాలు రెండు అని బలంగా చెప్పవచ్చు.

 Karnataka Elections 2018

మొదటిది: బారత మాజీ ప్రధాని దేవెగౌడ నాయకత్వంలోని జనతా దళ్ (సెక్యులర్) సింపుల్ గా జెడి(ఎస్) పాత మైసూర్ ప్రాంతంలో ఈ పార్టీకి మంచి పట్టు ఉంది. ఈ పార్టీ చాలా బలమైన "ఒక్కళిగ" కులానికి ప్రాతినిధ్యం వహిస్తుంది కావలసినంత బలమైన పునాదులు కలిగి ఉంది. ఈ పార్టీ మాత్రం కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం. దీని అధినేత దేవెగౌడకు కాంగ్రెసుకు ముఖ్యంగా సిద్ధరామయ్యకు మధ్య పచ్చగడ్దివేస్తే బగ్గుమనేంత బద్దవైరం. అందుకే ఈ పార్టీ మద్దతు బాజపాకి దక్కవచ్చు. దేవగౌడ కుమారుడు కుమారస్వామికి మాత్రం బాజపా అంటే కొంద వ్యతిరెఖత ఉన్నా ప్రస్తుతానికి మాత్రం ఈ పార్టీ బాజపాతో జతకట్టటం ఖాయం అని తెలుస్తున్న సమాచారం. అయితే రాజకీయాలు ఎప్పుడూ విజయ ప్రధమ్యాలుగా ఉంటాయి కాబట్టి, ఎప్పుడేమైనా సంభవించవచ్చు.

Image result for bjp congress in karnaTaka

అన్నీ పార్టీలను, కులాలను పక్కన బెట్తి - గత సర్వే లన్నింటిని బట్టి చూస్తే భారత ప్రధాని నరెంద్ర మోడీ కర్ణాటక ప్రజలకు అత్యంత ప్రీతిపాత్రుడు. భారత్ లో 80% ప్రజలు నమో ని ప్రధాని గా కోరుకుంటుంటే కర్ణాటకలో ఆ శాతం 79. అదే గుజరాత్ లో 68%. దీంతో నరెంద్ర మోడీ వ్యక్తిగత కరిష్మా కీలక పాత్ర పోషిస్తుందనటంలో ఎలాంటి సందేహం లేదు. మోడీ పాల్గొన్న ప్రతి రాలీ లో పాల్గొనే ప్రజా సమూహాలే (క్రౌడ్స్) ఆయన కరిష్మాని నింగి స్థాయికి చేరుస్తున్నాయి. ప్రతి రోజు ట్రాఫిక్ తో తల్లడిల్లే బాంగళూర్ లాంటి మహనగరం మొడీ రాలీకి మరింత క్రిక్కిరిసిపోతుంది. అనేక మంది ప్రజలు కుల మత ప్రమేయం లేకుండా తాము మోదీ నాయకత్వానికే ఓట్ చేస్తామని చెప్పటం సర్వసాధారణం. వారికి స్థానిక బాజపా నాయకుడెవరో అభ్యర్ధి ఎవరో తెలియని పరిస్థితుల్లో మోదీ కరిష్మా బాజపాకి ఆశాదీపం. తీరప్రాంత కర్ణాటకలో కాంగ్రెస్ కుల రాజకీయాలంటే మొహమ్మొత్తి ఉంది. అందుకే ఇక్కడ కాంగ్రెసుకు స్థానం లేదు. ఇది కూడా బాజపాకు అనుకూలాంశం.

Image result for karnataka map region wise

అయితే జెడిఎస్ కలసివస్తే మొత్తం తీర ప్రాంత కర్ణాటక, పాత మైసూర్ ప్రాంతాన్ని బాజపా ప్రభంజనం వీచటం అనివార్యం.

 

రెండవది:  అక్షరాస్యత-తొలి నుండీ బాజపాకు బృహన్ బాంగళూర్ నగరం బాజపాకు కంచుకోట. మత ప్రభల్యాన్ని ప్రక్కనబెట్టి చూస్తే - ముఖ్యంగా అక్షరాస్యతకు బాజపా గెలుపుకు సన్నిహిత సంభందాలు ఉన్నయనేది జగద్విధితం. అత్యధిక అక్షరాస్యత ఉన్న బంగళూర్లో ఇదే నిజమౌతూ వస్తుంది.

80 శాతానికి మించిన అక్షరాస్యత ఉన్న ఉత్తర కర్ణాటక, శివమొగ్గ, ఉడిపి, దక్షిణ కర్ణాటక, మొడగు, బాంగళూరు

75 నుంచి 80 శాతం అక్షరాస్యత ఉన్న ధార్వాడ్, దావణగేరే, తుముకూరు, హాసన్, గ్రమీణ కర్ణాటక గదగ్, చిక్మగళూర్

70 నుంచి 75 శాతం అక్షరాస్యత ఉన్న బీదర్, బెళగావి, చిత్రదుర్గ, కోలార్, మైసూర్, మనోయ,

60 నుంచి 70 లేదా 75 శాతం అక్షరాస్యత ఉన్న విజయపుర, కల్బండి, కొప్పళ, బాగల్కోట్, బళ్ళారి, చిక్బళ్ళాపుర, చిక్మంజనగర్,

మిగిలిన 60 శాతం కన్నా తక్కువ అక్షరాస్యత నమోదన ప్రాంతాలు బాజపాకు కొంత ఇబ్బంది కరమైన విషయమే 

ఈ మద్య కాంగ్రెస్ రాజకీయ వ్యూహకర్త  సిద్ధరామయ్య చేసిన "లింగాయత్ విన్యాసం" తో 18 శాతం ఉన్న ఆ వర్గం ప్రత్యేక మైనారిటీ  హోదా రాజకీయం వలన కర్ణాటక రాజకీయనావ ఏ తీరానికి చేరుతుందో చెప్పలేని పరిస్థితులు నెలకొన్నాయి.

ముగించే ముందు సంక్షిప్తంగా చెప్పేదేమంటే-ఇన్ని సమస్యలతో ఉన్నా!  కర్ణాటక  రాజకీయ సమరాంగణ క్షేత్రం లో అతి పెద్ద రాజకీయ పార్టీగా బాజపా ఉద్భవాన్ని నిలువరించటం ఎవరికైనా కష్టమేనట. కర్ణాటక ప్రజలు నిర్ద్వందంగా చెప్పే విషయమిది.

Related image

Karnataka Elections 2018 Opinion Poll Results

An opinion poll is a kind of survey, which is conducted to find out the public opinion before the elections. Exit polls are conducted, just after a candidate walks out after casting his or her vote. Below Is the opinion poll survey conducted by C fore:

PartyNumber of Seats
BJP (Bharatiya Janata Party)120-132
Congress60-72
JDU (Janata Dal-Secular)24-30
OthersUndecided

కర్ణాటకకు కొత్త జండా, కొత్త మతం - ఇప్పుడది సిద్ధరామయ్య కు బూమరాంగైంది?
https://www.apherald.com/Politics/ViewArticle/299793/lingayat-new-religion-new-janda--new-agenda-karna/

మరింత సమాచారం తెలుసుకోండి: