గత కొన్ని రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ వర్సెస్ వైసీపీ మద్య రగడ ఏ రేంజ్ లో కొనసాగుతుంతో అందరికీ తెలిసిందే.  ప్రత్యేక రాష్ట్రం ఏరప్పడి నాలుగు సంవత్సరాలు కావొస్తున్న ఎన్నికల సమయంలో ఇచ్చిన హీమీలు నెరవేర్చకుండా ప్రజలను మభ్యపెడుతున్నారని ప్రజల్లో చైతన్య స్ఫూర్తిని నింపి వచ్చే ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా చేసుకొని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ‘ప్రజా సంకల్ప యాత్ర’ మొదలు పెట్టిన సంగతి తెలిసిందే.  ఈ నేపథ్యంలో ఆయన పలు జిల్లాలు పర్యటిస్తున్నారు. 
Related image
ఎక్కడికి వెళ్లినా రాజన్న మళ్లీ వచ్చాడనని జగన్ ని ప్రజలు అక్కున చేర్చుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఈ మద్య కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని కుండబద్దలు కొట్టారు.  అప్పటి నుంచి ప్రజలు, ప్రజా ప్రతినిధులు ప్రత్యేక హోదా కోసం పోరాటానికి సిద్దమయ్యారు.  ఈ నేపథ్యంలో వైసీపీ పార్లమెంట్ లో నిరసనలు వ్యక్తం చేయడమే కాదు ఏకంగా కేంద్రంపై అవిశ్వాస తీర్మాణం కూడా పెట్టింది.  ఇదిలా ఉంటే వైసీపీ నేత విజయ్ సాయి రెడ్డిపై ఆ మద్య ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు విజయ్ మాల్యతో పోల్చిన విషయం తెలిసిందే.
Image result for ysrcp protest parliament
అయితే ఈ అంశంపై ఆయన అప్పట్లో కౌంటర్ వేశాడు..అంతే స్థాయిలో గజదొంగ చార్లెస్ శోభ రాజ్ తో పోల్చాడు విజయ సాయి రెడ్డి.తాజాగా మరోసారి చంద్రబాబు పై విజయ్ సాయి ఫైర్ అయ్యారు. నన్ను విజయమాల్యాతో పోల్చిన ఈ చంద్రబాబు 2016 మార్చిలో మాల్యాను లండన్ లో కలిశారని ఆరోపించారు. మాల్యా దగ్గర మీ పార్టీ కోసం రూ. 150 కోట్ల విరాళం తీసుకున్నారని చెప్పారు.
Image result for chandrababu
ఈ విషయంపై చంద్రబాబు స్పందించాలని డిమాండ్ చేశారు. స్పందించకపోతే తాను చేసిన ఆరోపణలు నిజమే అని నమ్మాల్సి వస్తుందని చెప్పారు.పార్లమెంట్ సాంప్రదాయాలను మంటగలిపారని, అనుచిత వ్యాఖ్యలు చేశారని ఈ నేపథ్యంలో చంద్రబాబుపై రాజ్యసభ చైర్మన్ కు సభాహక్కుల నోటీసులు ఇచ్చామని తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: