కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన రాగాల వెంకట రాహుల్ పేరు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు భారత దేశం వ్యాప్తంగా మారుమోగిపోతుంది. కామన్వెల్త్‌ గేమ్స్‌ వెయిట్‌లిఫ్టింగ్‌లో స్వర్ణ పతకం సాధించిన తెలుగు తేజం రాగాల వెంకట్‌ రాహుల్‌ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశాడు. ప్రజా సంకల్ప యాత్రలో ఉన్న వైఎస్‌ జగన్‌ను ఆదివారం ఆగిరిపల్లి క్యాంపు వద్ద రాహుల్‌ తన తండ్రి మధుతో పాటు కలిశాడు.
Gold Winner Ragala Venkata Rahul Meets YS Jagan Mohan Reddy - Sakshi
ఈ సందర్బంగా జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. ఏపిలో క్రీడాభివృద్దికి ఎంతో కృషి చేయాల్సిన అవసరం ఉందని..నిరుపేద క్రీడాకారులను ప్రోత్సాహించాలని అన్నారు.  రాహుల్‌ భవిష్యత్‌లో మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. రాహుల్‌కు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కోన రఘుపతి లక్ష రూపాయలు ఆర్థిక సాయం ప్రకటించారు.
Image result for రాగాల వెంకట రాహుల్
ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా స్టువర్టుపురం ప్రాంతానికి చెందిన రాగాల వెంకట్‌ రాహుల్‌  గోల్డ్‌కోస్ట్‌ (ఆస్ట్రేలియా) వేదికగా జరిగిన కామన్వెల్త్‌ గేమ్స్‌లో 85 కేజీల విభాగంలో స్వర్ణ పతకం సాధించిన విషయం తెలిసిందే. కాగా, మన్వెల్త్ క్రీడల్లో పతకం సాధించిన రాహుల్‌కు జనసేన తరఫున రూ. 10 లక్షల సాయం చేస్తామని పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఏపీ ప్రభుత్వం కూడా రూ. 30 లక్షల నజరానా ప్రకటించింది.



మరింత సమాచారం తెలుసుకోండి: