మలేషియాకు చెందిన బడ్జెట్‌ ఎయిర్‌ లైన్స్‌ సంస్థ ఎయిర్‌ ఏషియా (2014లో)టాటా గ్రూపుతో కలిసి దేశీయ విమానయాన రంగంలోకి అడుగుపెట్టింది. కానీ అప్పటి నిబంధనల ప్రకారం స్థానికంగా 5 ఏళ్లు సర్వీసులు నడిపి, 20 విమానాలు కలిగిన ఉన్న సంస్థలకు మాత్రమే అంతర్జాతీయ సర్వీసులు నడపడానికి అనుమతిచ్చేవారు. దీన్నే 5/20 నిబంధన అని పేర్కొంటారు.



కానీ ఎయిర్‌ ఏషియా ఇండియాకు విదేశీ సర్వీసులు నడపడానికి గాను ఈ నిబంధనను మార్చాలని తీవ్రమైన ఒత్తిడి తీసుకువచ్చింది. కానీ దీన్ని స్పైస్‌ జెట్, జెట్‌ ఎయిర్‌వేస్‌ వంటి స్థానిక విమానయాన కంపెనీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. అయినా జూన్, 2016లో 5/20 నిబంధనను సవరిస్తూ అప్పటి పౌరవిమాన యాన శాఖ మంత్రి అశోక గజపతి రాజు నిర్ణయం తీసుకున్నారు. ఈ సవరణ ప్రకారం ఐదేళ్ల సర్వీసు లేకుండా కేవలం 20 విమానాలు ఉంటే అంతర్జాతీయ సర్వీసులు నడుపుకోవచ్చు. ఈ నిబంధన వల్ల మలేషియాకు చెందిన ఎయిర్‌ ఏషియా, విస్తారా సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌కు భారీ ప్రయోజనం జరిగింది. ఆ విధంగా ఎయిర్‌ ఏషియా దేశీయ విమానయానంలోకి అడుగు పెట్టిన రెండేళ్లలోనే ఈ లైసెన్స్‌ను దక్కించుకుంది.   

Image result for air asia scam chandrababu ashok

"Chandrababu Naidu potential PM, tells AirAsia India head to his boss"


“His finance minister is now the civil aviation minister. If you play nice with Chandrababu Naidu, we will get everything" The civil aviation minister told me.


మన పచ్చ పత్రికలు ఈ వార్తలు రాయవు. జాతీయ మీడియా కోళ్ళూ 2015 నుండే కూసేస్తున్నాయి. 



ఈ కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. అంతర్జాతీయ విమానయానానికి కావాల్సిన పర్మిట్లను తెచ్చుకునేందుకు ఎయిర్‌ ఏషియా అడ్డదారులు తొక్కిన విషయం తెలిసిందే. పర్మిట్ల కోసం విమానయాన శాఖ ఉద్యోగులకు ఎయిర్‌ ఏషియా లంచాలు ఎరవేసింది. దాదాపు పది లక్షల డాలర్లను లంచాలను విమానయాన శాఖ అధికారులు స్వీకరించినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అంచనా వేసింది. దీనిపై విచారణ జరపాలని కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)కి సూచించింది. దీంతో రంగం లోకి దిగిన సీబీఐ ఇప్పటికే పలువురు పౌర విమానయాన శాఖ ఉద్యోగులను అరెస్టు చేసింది.

Image result for air asia scam chandrababu ashok

ఈ వ్యవహారమంతా హైదరాబాద్‌ కేంద్రంగానే జరిగినట్లు కొన్ని సాక్షాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఆడియో టేపులకు మరింత బలం చేకూర్చే విధంగా ఈ రాయబేరం కోసం సింగపూర్‌కు చెందిన కంపెనీని రంగంలోకి దింపడానికి ఎయిర్‌ ఏషియా హైదరాబాద్‌ నోవాటెల్‌లో సమావేశమైనట్లు సాక్ష్యాలు వెలుగులోకి వచ్చాయి. మార్చి 21, 2015లో హైదరాబాద్‌లో జరిగిన 11వ ఎయిర్‌ ఏషియా ఇండియా బోర్డు మీటింగ్‌లో సింగపూర్‌కు చెందిన 'హెచ్‌ఎన్‌ఆర్‌ ట్రేడింగ్‌ పీటీఈ' ని లాబీ కోసం నియమిస్తూ తీసుకున్న కాపీని మనీ కంట్రోల్‌ వెబ్‌సైట్‌ వెలుగులోకి తీసుకొచ్చింది.


టేపుల్లో ఎయిర్‌ ఇండియా సీఈవో టోనీ ఫెర్నాండెజ్‌ స్థానికంగా ఉన్న వ్యక్తిని రాయబేరాలకు తీసుకోమనడం.. హైదరాబాద్‌ కేంద్రంగా బోర్డు సమావేశంలో హెచ్‌ఎన్‌ఆర్‌ ట్రేడెండ్‌కు చెందిన రాజేంద్ర దూబేకు బాధ్యతలు అప్పచెప్పడం మరింత బలాన్ని చేకూరుస్తోంది. అప్పటికి ఓటుకు నోటు కేసుకు సంబంధించి ఆడియో టేపులు వెలుగులోకి  రాకపోవడంతో చంద్రబాబు హైదరాబాద్‌ కేంద్రంగానే ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న సంగతి విదితమే. ఓటుకు నోటు కుంభకోణం బయటపడిన తర్వాత నే చంద్రబాబు తన కార్యక్షేత్రాన్ని అమరావతికి మార్చారు. మలేషియా ఎయిర్‌లైన్స్‌ కంపెనీతో బేరసారాల కోసం ఒక సింగపూర్‌ సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవడం మరింత అనుమానాలకు తావిస్తోంది.  

Air Asia CEO Tony Fernandes faces tough time both in India and Malaysia 

అవినీతి కేసును తవ్వితీస్తున్న సమయంలో సీబీఐకు ఎయిర్‌  ఏషియా సీఈవో టోనీ ఫెర్నాండెజ్‌, ఎయిర్‌ ఏషియా (ఇండియా) సీఈవో మిత్తూ శాండిల్యాల మధ్య 30 నిమిషాల పాటు జరిగిన సంభాషణ ఆడియో టేపు సీబీఐ చేతికి చిక్కింది. ఈ మేరకు జాతీయ మీడియా ‘బిజినెస్‌ టుడే’ ఓ కథనాన్ని ప్రచురించింది. కాగా, ఆడియో టేపులో ఆంధ్రప్రదేశ్‌ సిఎం నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర విమానయాన శాఖ మాజీ మంత్రి అశోక్‌ గజపతి రాజు పేర్లు ఉన్నాయి. అడ్డదారిలో పర్మిట్లు రావాలంటే చంద్రబాబును పట్టుకోవాలని టోనీ ఫెర్నాండెజ్‌,  మిత్తూ  శాండిల్యాల మధ్య సంభాషణలు ల ద్వారా అర్ధమౌతుంది. 


‘చంద్రబాబును పట్టుకుంటే కావాల్సిన పని అయిపోతుంది. ఆయన మనిషే కేంద్రంలో విమానాయాన శాఖ మంత్రి. అసలుదారిలో వెళ్తే చాలా సమయం పడుతుంది. అడ్డదారిలో వెళ్లి పని చేయించుకోవాలి. చంద్రబాబును మన వైపు తిప్పుకుంటే ఏ పనైనా పూర్తవుతుందని గతంలో అశోక్‌ గజపతి రాజే చెప్పారు.’  అని ఆడియో టేపులో శాండిల్య  మాట్లాడారు.


అయితే, ఈ ఆడియో టేపు ఎప్పటిదో తెలియాల్సివుంది. బీజేపీతో తెగదెంపుల సందర్భంగా అశోక్‌ గజపతి రాజు పౌరవిమానయాన శాఖ మంత్రిగా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఎయిర్‌ ఏషియా సీఈవో ఫెర్నాండెజ్‌ బుధవారం సీబీఐ ముందు విచారణకు హాజరుకానున్నారు. 

మన నిప్పుకి మకిల బట్టింది. 

 Image result for air asia scam chandrababu ashok

మరింత సమాచారం తెలుసుకోండి: