చంద్రబాబును ఎవరూ ప్రశ్నించరాదు. ఆయన పేరుకే ప్రజస్వామ్యంలో ఉన్నారు. ఆయన అమరావతి మహ అసామ్రాజ్యానికి సార్వంసహాసార్వభౌములా! అన్నట్లు కని పిస్తుంది. సార్వభౌముణ్ణి ఎవరూ ప్రశ్నించకూడదు. ఆయన ఈతరహా స్వభావమే ప్రధాని నరెంద్రమోడీతో కయ్యానికి కారణమై రాష్ట్రానికి ఇక్కట్లుతెచ్చిందని అంటున్నారు  రాజకీయ విశ్లేషకులు.

Related image

చంద్రబాబు కాకుండా మరెవరైనా ముఖ్యమంత్రి అయి ఉంటే రాష్ట్రం మరో లాగా విజయపథంలో పయనించేదని విమర్శకుల భావన. నాలుగు సంవత్సరాలు సుజానా చౌదరి, సిఎం రమేష్ తదితరులు కేంద్రంతో సఖ్యతగా ఉండి ఇచ్చిన సొమ్ముకు లెక్కలు అడిగితే కేంద్రంపై యూ—టర్న్ తీసుకొని దాడి మొదలెట్టాడు బాబు. ఎవరితో పొత్తుపెట్టుకున్నా చివరాఖరికి ఎన్నికల ముందు బాబు మానసికంగా ఏదొ ఆయిపోతూ రాజకీయ గందరగోళం సృష్టిస్తారని అంటున్నారు. నాలుగేళ్ళు లేని గోల ఇప్పుడెందు కంటే అది బాబు గారి ఎన్నికల కుతంత్రం అంటారు బాబు నైజం పూర్తిగా తెలిసినవారు.


కావలిలో పర్యటనకు వచ్చిన బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు చేదు అనుభవం ఎదురైంది. కావలిలో నిర్వహించిన ర్యాలీలో ఆయనను లక్ష్యంగా చేసుకుని ఒక వ్యక్తి చెప్పు విసిరాడు.దీంతో ఆగ్రహించిన బీజేపీ కార్యకర్తలు ఆ వ్యక్తికి దేహశుద్ధి చేసి పోలీసు స్టేషన్‌లో అప్పగించారు. ఆ వ్యక్తి ప్రకాశం జిల్లా టంగుటూరుకు చెందిన గొర్రెపాటి మహేశ్‌గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Image result for kanna lakshmi narayana chappal attack

ఈ సంఘటనపై నిరసన వ్యక్తం చేస్తూ బీజేపీ నేతలు కావలి పీఎస్ ముందు బైఠాయించారు. అంతకు ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కన్నా ఒక బహిరంగలేఖ రాశారు.. ఆ లేఖలో ఐదు ప్రశ్నలు అడిగి వాటికి సమాధానాలు చెప్పాల్సిందిగా డిమాండ్ చేశారు.

Related image

ఆ పంచ ప్రశ్నలు ఇవే:
  • టీడీపీ వెబ్‌-సైట్ నుంచి మీ మేనిఫెస్టోను ఎందుకు తొలగించారు.

  •  మీరు చేసిన తొలి వాగ్థానాలు అమలు చేశామని చెప్పగలరా?

  • ఓటుకు నోటు కేసులో "బ్రీఫ్డ్-మీ" అనే మాటలు మీవి కాదని చెప్పగలరా?
  • జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేసి రాజ్యాంగ బద్ధంగా ఎన్నికైన స్థానిక సంస్థలను నిర్వీర్యం చేయలేదా?
  • విశాఖ సమ్మిట్ ద్వారా 2,589 ఒప్పందాలు కుదుర్చుకున్నామని, ₹16,00,815కోట్ల పెట్టుబడులు  వచ్చాయని తద్వారా 36,87,460ఉద్యోగాలు వచ్చాయని చెప్పిన మీ     మాటలు చేతల్లో ఋజువు పరుస్తారా ఉద్యోగాలిచ్చి చూపిస్తారా?
Image result for kanna lakshmi narayana chappal attack
పైన పంచ ప్రశ్నలు నూటికి నూరుపాళ్ళు నిజం. మరెందుకు చంద్రబాబు ఎదుటివారికి సమాధానాలు ఇవ్వకుండా ప్రశ్నించిన వారిపై తనమంత్రులు, టిడిపి ప్రతి నిధులు  అమరావతి చంద్రుణ్ణి ప్రశ్నించిన వేరెవరి పైనైనా ఆఖరికి బిజెపి అధ్యక్షుడు అమిత్ షా పైన కూడా బాబే దాడి చేయించాడంటారు. కన్నాపై చెప్పులదాడి, ఇక ఇదే ఏపి గ్రౌండ్ రియాలిటీ. ఎన్నికల వరకు ఆయన గెలిచేవరకు లేదా ఓడేవరకు కార్యకర్తలతో దాడి చేయిచటం కడు శోచనీయం, అమరావతి పాలకుల గ్రౌండ్ రియాలిటీ  అంటున్నారు అమరావతి వాసులు. ఇక బాబే సమాధానం చెప్పాలి. 


తనపై దాడి జరగడానికి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అంతా బాబు నాయకత్వంలోనే జరిగిందని ఏపీ బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. అభివృద్ధి పేరుతో రాష్ట్రాన్ని దోచేస్తున్న టీడీపీ నేతల అవినీతిని ప్రజలకు తెలిజెప్పడం తప్పా? అని ప్రశ్నించారు. ఈ మేరకు ట్విటర్లో బుధవారం సాయంత్రం ఆయన పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: