ఎన్డీయే నుంచి చంద్ర‌బాబు బ‌య‌ట‌కు వెళ్లినా.. ఇప్ప‌టికీ ఆయ‌న మా మిత్రుడే.. మాది విడ‌గొడితే విడిపోయే బంధం కాదు.. నిండు స‌భ‌లో హోమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అన్న మాట‌లివి.. ఈ రెండు మాట‌లు చాల‌వా.. బీజేపీ, టీడీపీ బంధం గురించి చెప్ప‌డానికి.. ఈ రెండు మాట‌లు చాల‌వా.. టీడీపీ, బీజేపీ బంధం గుట్టుర‌ట్ట‌యింద‌నడానికి.. కేంద్రాన్ని క‌డిగిపారేస్తామ‌ని చంద్ర‌బాబు అంటుంటే.. ఆయ‌న ఎప్ప‌టికీ  మావాడే అంటూ క‌మ‌లం పెద్ద‌లు కౌగిలించుకోవ‌డంలో ఆంత‌ర్యం ఇదికాక‌పోతే..మ‌రేమై ఉంటుంది..?  పాపం.. రాష్ట్ర బీజేపీ నేత‌లు.. అవిశ్వాసం సంద‌ర్భంగా.. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు జాత‌కం బ‌య‌ట‌పెడుతామ‌ని రంకెలు వేశారు.. కానీ రాజ్‌నాథ్ ప‌లుకుల‌తో మూతులు ముడుచుకున్నారు.. అయ్య‌య్యో.. ఇదేమ‌రి బాబుగారి రాజ‌కీయం అంటే.. పైనొక‌టి.. లోనొక‌టి.. ఈ రెండింటినీ తిప్పితిప్పి వాడ‌టంలో ఆయ‌నకాయ‌నే సాటి. 

Image result for modi babu

కేంద్రాన్ని క‌డిగిపారేస్తామ‌ని చెప్పిన టీడీపీ కొత్త‌గా చెప్పిందేమీ లేదు.. ఇక ఏపీకి బీజేపీ పెద్ద‌లు కొత్త‌గా ఇచ్చిందేమీ లేదు.. చెప్పిన మాట‌ల్నే రెండు పార్టీల నేత‌లు తిప్పితిప్పి చెప్పుకున్నారంతే.. బాబు బాగోతాన్ని బ‌య‌ట‌పెడుతామంటూ చెప్పిన రాష్ట్ర బీజేపీ నేత‌లు.. బాబుగారిని రాజ్‌నాథ్ భుజాన వేసుకోవ‌డంతో నోరు ఆర‌బెట్టుకున్నారంతే.. నిజానికి.. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబును రాజ్‌నాథ్ ఒక్క‌మాటైనా అన‌లేదు.. ఆయ‌న విమ‌ర్శించ‌లేదు.. ఏపీకి ప్ర‌త్యేక ప్యాకేజీకి చంద్ర‌బాబు ఒకే చెప్పిన విష‌యాన్ని కూడా ఆయ‌న స‌భ‌లో ప్ర‌స్తావించ‌లేదు. ఏపీకి చేయాల్సిన‌దానికంటే.. ఎక్కువ‌గానే చేశామ‌నీ.. ఇక ముందు కూడా సాయం చేస్తామ‌ని ఆయ‌న చెప్ప‌డం గ‌మ‌నార్హం. ఏపీ అభివ‌`ద్ధికి బీజేపీ క‌ట్టుబ‌డి ఉంద‌నీ.. ప్యాకేజీ రూపంలో సాయం అందిస్తామ‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు త‌ప్ప మ‌రోముచ్చ‌ట తీయ‌లేదు. 

Image result for modi babu

ఇక్క‌డ మ‌రో విష‌యం ఏమిటంటే.. బీజేపీతో వైసీపీ, జ‌న‌సేన‌లు క‌లిసి కుమ్మ‌క్కు రాజ‌కీయాలు చేస్తున్నాయ‌ని ప‌దేప‌దే చెప్పిన ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు.. పార్లమెంటు సాక్షిగా.. టీడీపీ, బీజేపీ బంధం గుట్టుర‌ట్టు కావ‌డంతో ఏం చెబుతార‌నే ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్న‌మువుతున్నాయి. అంతేగాకుండా.. ఇటీవ‌ల జ‌రిగిన నీతి ఆయోగ్ స‌మావేశం సంద‌ర్భంగా ప్ర‌ధాని మోడీకి వంగివంగి క‌ర‌చాల‌నంచేస్తూ చంద్ర‌బాబు త‌న భ‌క్తిభావాన్ని చాటుకున్న ద‌`శ్యం మ‌రోసారి చ‌ర్చ‌కొచ్చింది. నిజానికి.. దేశ‌వ్యాప్తంగా మోడీ ప్రభ మ‌స‌క‌బారుతున్న వేళ‌.. మ‌ళ్లీ ఆయ‌న గ్రాఫ్ పెర‌డానికి చంద్ర‌బాబు పెట్టిన అవిశ్వాసం ప‌రోక్షంగా తోడ్పాటునందించింద‌ని కూడా చెప్పుకోవాలి. ఇన్నాళ్లూ.. ఎన్డీయేలో లుక‌లుక‌లు ఉన్నాయ‌ని.. మోడీ ప‌ట్టుకోల్పోతున్నార‌ని జ‌రుగుతున్న ప్ర‌చారంలో నిజం లేద‌ని చంద్ర‌బాబు నిరూపించార‌నే టాక్ కూడా వినిపిస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: