భారత స్వాతంత్ర సంగ్రామాన్ని పరిశీలిస్తే ఎందరో త్యాగధనుల అధ్యాయాలు మనకు గోచరమవుతాయి.  దేశ స్వాతంత్రమే లక్ష్యంగా దాని ముందు స్వలాభం, కుటుంబ బంధాలు లాంటి అంశాలను తృణప్రాయంగా భావించిన ఎందరో వీరుల చరిత్ర భారత స్వాతంత్ర సంగ్రామ చరిత్ర పుస్తకంలో పేజీలై మనల్ని పలకరిస్తాయి.  బ్రిటీష్ వారు బారతీయులను కట్టు బానిసలుగా రెండు వందల సంవత్సరాలు పరిపాలించారు..వారి పాలనను వ్యతిరేకిస్తూ..ఎంతో మంది త్యాగధనులు తమ ప్రాణాలు కోల్పోయారు. 
Image result for భారత స్వాతంత్ర సంగ్రామం
అయితే కొంత మంది సాయుధ పోరాటంతో మరికొంత మంది శాంతి మంత్రంతో ఇలా భారత దేశ మాత బందీ సంకెళ్లను తెంచారు.  బ్రిటీష్ వారినికి భారత దేశం నుంచి పంపించారు.   తెల్లదొరల గుండెల్లో నిద్రపోయిన మన్యం వీరుడు అల్లూరి నుంచి సాయుధ సంగ్రామానికి సైన్యం ఏర్పాటు చేసిన సుభాష్ చంద్రబోస్ వరకు స్వాతంత్రం కోసం ప్రాణార్పణ చేసినవారే. మరోవైపు దేశానికి స్వాతంత్రం సంపాదించాలంటే అది శాంతి మార్గంతోనే సాధ్యమని నమ్మి అదే దారిలో చివరివరకు పోరాడి దేశానికి స్వాతంత్రం సంపాదించి పెట్టిన ఘనత మహత్ముడికే దక్కుతుంది. 
Image result for భారత స్వాతంత్ర సంగ్రామం
ఆనాడు అంతమంది ఎన్నో కష్ట నష్టాలకోర్చి స్వాతంత్రాన్ని సంపాదించారు కాబట్టే భారత స్వాతంత్ర సంగ్రామ చరిత్ర మహోన్నత అధ్యాయంగా నేటికీ అందరి చేతా కొనియాడబడుతోంది. స్వాతంత్రమనే నిధి సాకారమైన ఆగస్టు 15 రోజు గురించి తల్చుకుంటే భారతీయుడైన ప్రతి ఒక్కరికీ మనసులో ఉద్వేగం ఉప్పొంగుతుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: