ఆంధ్రప్రదేశ్ అనంతపూర్..తాడిపత్రిలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న సంచలనాలు అన్నీ ఇన్నీ కావు.   ప్రబోధానంద స్వామి ఆశ్రమం డేరా బాబాను తలపిస్తుందని..ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి రచ్చ రచ్చ చేస్తున్నారు.  ఇది చిలికి చిలిక గాలివానగా మారిపోతుంది..ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి కూడా వెళ్లింది.  తాజాగా ఈ విషయంపై ప్రబోధానంద స్వామి స్పందించారు.  అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై ప్రబోధానంద స్వామి  సంచలన ఆరోపణలు చేశారు.   

ఆయనకు తాము డబ్బు ఇవ్వలేదనే కారణంతో తమపై ఆయన కక్షగట్టారని, తమను ఎంతో వేధించారని ఆవేదన వ్యక్తం చేశారు. కక్షతో పక్క గ్రామాల ప్రజలను ఉసిగొల్పారని మండిపడ్డారు. 'ఆశ్రమంలో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగడం లేదు...మేం ప్రచారం కోసం పాకులాడటం లేదు...ఆశ్రమానికి ఐఏఎస్‌లు, ఇతర అధికారులు కూడా వస్తున్నారు...తప్పు జరిగితే జనం ఆశ్రమానికి వాళ్లు ఎందుకొస్తారు? అని ప్రశ్నించారు.    ప్రచారం కోసం తాము పాకులాడటం లేదని చెప్పారు.

అడిగిన వారికి అన్నం పెట్టామని తెలిపారు. 1993లో బీజేపీ నేతలకు ఆశ్రయం కల్పించామని తమను తరిమి కొట్టారని... కొంతకాలం బెంగళూరులో ఉండి 2003లో ఆశ్రమాన్ని మళ్లీ ప్రారంభించామని చెప్పారు.  2003 లో కృష్ణమందిరం ప్రారంభోత్సవానికి ఎంపి జెసిని ఆహ్వానించామని , అప్పుడు డబ్బు ఇవ్వలేదనే ఆయన తమపై కక్ష గట్టారని ప్రబోధానంద వెల్లడించారు. ఆ తరువాత ఆయన తమను వేధింపులకు గురిచేశారని స్వామి ప్రబోధానంద ఆరోపించారు. 

ఎంపి జెసి ఆ పాతకక్షలతోనే పక్క గ్రామాల ప్రజలను తమ పైకి ఉసిగొల్పారని స్వామి ప్రబోధానంద విమర్శించారు. ఇదిలావుంటే ప్రభోదానందస్వామి బోధనలు మత విశ్వాసాలను దెబ్బతీసే విధంగా ఉంటున్నాయని చెప్పడంతో పాటు ఆశ్రమంలో అనేక రకాలైన అసాంఘిక చట్టవ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నాయని ఎంపి జెసి దివాకర్‌రెడ్డి ఆరోపించిన సంగతి తెలిసిందే. 


మరింత సమాచారం తెలుసుకోండి: