మోహన్ దాస్ కరంచంద్ గాంధీ (అక్టోబరు 2, 1869 - జనవరి 30, 1948) భారతీయులందరిచే ఆదరింపబడే ఒక గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు. ప్రజలు ఆయనను జాతిపితగా గౌరవిస్తారు. సత్యము, అహింసలు గాంధీ నమ్మే సిద్ధాంత మూలాలు. సహాయ నిరాకరణ, సత్యాగ్రహము ఆయన ఆయుధాలు. కొల్లాయి గట్టి, చేత కర్రబట్టి, నూలు వడకి, మురికివాడలు శుభ్రం చేసి, అన్ని మతాలూ, కులాలూ ఒకటే అని చాటి, ఆ మహాత్ముడు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించాడు.

సత్యాగ్రహమూ, అహింస పాటించడానికి ఎంతో ధైర్యము కావాలని బోధించాడు. మహాత్ముడనీ, జాతిపిత అనీ పేరెన్నిక గన్న ఆయన ఆంగ్లేయుల పాలన నుండి భారతదేశానికి స్వాతంత్రం సాధించారు. 1919 మొదలు బ్రిటీష్ పాలన నుంచి దేశాన్ని విముక్తి చేసేందుకు పతాక స్థాయి ఉద్యమాన్ని లేవనెత్తారు. శాంతి, అహింస ఆయుధాలుగా సరికొత్త పోరాటానికి ఊపిరిలూదారు.

  1918 వరకు బ్రిటీష్ సామ్రాజ్యానికి మద్దతుగా ఉన్న గాంధీజీ.. 1919లో అమృత్‌సర్ హత్యాకాండ తర్వాత మాత్రమే ఆయన ఆంగ్లేయులపై సమరభేరి మోగించారు. అమృత్‌సర్‌లోని జులియన్‌ వాలాబాగ్‌లో గూర్ఖా సైనికులతో కలిసి జనరల్ డయ్యర్ 370 మంది భారతీయులను కాల్చిచంపాడు. ఈ ఉదంతం తర్వాత గాంధీజీ ఆలోచనలు మారిపోయాయి. భారత దేశానికి పూర్తి స్వాతంత్ర్యం అవసరమని చాటిచెబుతూ 1919-22 మధ్య భారీ ఆందోళనలతో పాటు 1930లో ఉప్పు సత్యాగ్రహానికి పిలుపునిచ్చారు.

  గాంధీజీ తన జీవితంలో రోజుకు దాదాపు 18 కిలోమీటర్లు నడక, ప్రయాణం చేశారు. ఈ దూరంతో ప్రపంచాన్ని రెండుసార్లు చుట్టిరావచ్చు.

  నోబెల్ శాంతి పురస్కారానికి గాంధీజీ పేరు ఐదుసార్లు నామినేట్ అయినప్పటికీ... ఏకాభిప్రాయం కుదరకపోవడం వల్ల అవార్డు ఇవ్వలేదు. 1989లో దలైలామాకు నోబెల్ పురస్కారం రాగా... ఇది గాంధీజీకి అసలైన నివాళి అంటూ నోబెల్ కమిటీ చైర్మన్ వ్యాఖ్యానించారు.

— 1893 నుంచి 1915 వరకు దక్షిణాఫ్రికాలో ఉన్న గాంధీజీ... భారత మైనారిటీల కోసం పలుమార్లు ఉద్యమానికి నాయకత్వం వహించారు.

  అహింసా సిద్ధాంతానికి మారుపేరుగా నిలిచిన ఆయన బోయెర్ యుద్ధం సందర్భంగా సైన్యంలో పనిచేశారు. ఈ యుద్ధం తర్వాత మాత్రమే ఆయన యుద్ధంలో భయంకర విషయాలను గుర్తించగలిగారని చెబుతారు.

  దక్షిణాఫ్రికాలో ఉండగానే 1900ల్లో పాసివ్ రెసిస్టర్స్ సాకర్ క్లబ్ పేరిట మూడు ఫుట్‌బాల్ క్లబ్బులను ప్రారంభించారు. జట్టు విశ్రాంతి సమయాల్లో అహింసా నిరోధక సూత్రాలను బోధించడంతో పాటు, ప్రేక్షకులకు అహింసా సూత్రాలపై కరపత్రాలు పంచిపెట్టేవారు.



మరింత సమాచారం తెలుసుకోండి: