అనంతపురం జిల్లాలోనే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిటాల బ్రాండ్‌ గురించి ప్రతేకంగా చెప్పక్కర్లేదు. పరిటాల రవి తర్వాత ఆయన రాజకీయ వారసురాలుగా ఎంట్రీ ఇచ్చిన ఆయన సతీమణి సునీత గత మూడు ఎన్నికల్లోనూ వరుస విజయాలు సాధిస్తూ ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు. 2005లో పెనుగొండ నుంచి, 2009, 2014 ఎన్నికల్లో రాప్తాడు నుంచి గెలిచిన సునీత ఫ్యూచర్‌ వచ్చే ఎన్నికల్లో ఎలా ఉంటుంది ? వచ్చే ఎన్నికల్లో ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగాలని చూస్తున్న సునీత తనయుడు శ్రీరామ్ కల‌ నెరవేరుతుందా, ప్రస్తుతం శ్రీరామ్‌ ఏ సీటుపై కన్నేసాడు ? జిల్లాల్లో ఏ టీడీపీ ఎమ్మెల్యేకి ఎర్త్‌ పెట్టాలనుకుంటున్నాడు ? శ్రీరామ్‌ పొలిటికల్‌ ఎంట్రీపై అనంతపురం జిల్లాల్లో ఎలాంటి రాజకీయ చర్చలు జరుగుతున్నాయో అంటే ఆస‌క్తిక‌ర ఆన్స‌ర్లే వినిపిస్తున్నాయి.

paritala sunitha siram కోసం చిత్ర ఫలితం

పరిటాల శ్రీరామ్‌ పొలిటికల్‌ ఎంట్రీపై గత రెండు ఏళ్లుగా మీడియా వర్గాల్లోనూ, రాజకీయ వర్గాల్లోనూ వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో పోటీ చెయ్యాలనుకుంటున్న శ్రీరామ్‌ జిల్లాల్లో ఓ టీడీపీ సీనియర్‌ ఎమ్మెల్యే సీటుపై కన్నేసి ఆయనకు ఎర్త్‌ పెట్టే ప్రయత్నాలు చేస్తున్నాడని ప్రచారం జరుగుతుంది. కళ్యాణ దుర్గం టీడీపీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ్‌ చౌదరి ఇప్పటికే వయోభారంతో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకు చంద్రబాబు సీటు ఇవ్వరన్న టాక్‌ ఇప్పటికే బయటకు వచ్చేసింది. ఈ క్రమంలోనే ఆ సీటుపై ఆయన తనయుడు ఉన్నం మారుతి చౌదరి కన్నేసారు.


అయితే ఇప్పుడు శ్రీరామ్‌ ఇక్కడ ఉన్నం ఫ్మామిలీని తప్పించి హనుమంతరాయ్‌ చౌదరి పోటీ చెయ్యని పక్షంలో ఆ సీటు తనకు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నట్టు తెలుస్తోంది. వాస్తవంగా పరిటాల సునీత ఇప్పటికే రాప్తాడులో ఏటికి ఎదురు ఈదుతున్నారు. గత రెండు ఎన్నికల్లోనూ తక్కువ మెజారిటీతో గెలిచిన ఆమె తాను గతంలో పోటీ చేసిన పెనుగొండ నుంచి పోటీ చెయ్యాలని ప్రయత్నాలు చేస్తున్నారు. పెనుగొండలో బీసీ ఎమ్మెల్యేగా ఉన్న సీనియర్‌ నేత బీకే. పార్థసారధిని తప్పించేందుకు చంద్రబాబు ఇష్టపడడం లేదు.

paritala sunitha siram కోసం చిత్ర ఫలితం
సునీతను రాప్తాడుకే పరిమితం చెయ్యాలని చంద్రబాబు భావిస్తుండడంతో ఆమె ఇప్పుడు రాప్తాడులోనే సంక్లిష్ట ప‌రిస్థితుల్లో పోటీకి రెడీ అవుతున్నారు.
టీడీపీలో చాలా మంది సీనియర్ ఫ్యామిలీలకే రెండో టిక్కెట్‌ ఇవ్వని పక్షంలో మరి చంద్రబాబు పరిటాల వారసుడికి కళ్యాణ దుర్గం సీటు ఇస్తారా? ఉన్నం హనుమంతరాయ చౌదరిని తప్పిస్తే అక్కడ బీసీలకు ఇవ్వాలన్న మరో డిమాండ్‌ కూడా తెర మీదకు వస్తోంది. మరి ఈ నేపథ్యంలో శ్రీరామ్‌ ప్రయత్నాలు ఎంత వరకు ఫలిస్తాయో చూడాల్సి ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి: