నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం అధినేత మైండ్ దారి తప్పిందా? నియంత్రణ కోల్పోతే రాష్ట్ర పాలన ఎలానడుస్తుంది. కారణం తెలుగుదేశం పార్టీలో మరో ప్రత్యామ్నాయం లేదు. అంతకు మించి విఙ్జత ప్రదర్శించే నాయకులు ఎవరూ లేరు. గత నాలుగు సంవత్సరాలుగా చంద్రబాబు చెప్పెదాన్ని మక్కికి మక్కిగా చేయటం తప్ప మాట్లాడం తప్ప అలోచించే వారెవరూ లేరు. అంతెకాదు చంద్రబాబు నడుస్తున్న దారి ముళ్ళదారి అయినా టిడిపి వాళ్ళకు అది రాచబాటగానే అనుసరిస్తూవస్తున్నారు.

Image result for No entry GO of AP for CBI

ఇది రాజుల రాజ్యం కాదు చంద్రబాబేమీ సార్వభౌముడు కాదు. కనీసం తాబేదారు కూడా కాదు. అలాంటి ప్రజాస్వామ్యంలో దేశాన్ని ఏకెరెకృతంగా పాలించే కేంద్ర  స్వతంత్ర రాజ్యాంగ సంస్థ సీబీఐకి ఆంధ్రప్రదేశ్ లో సోదాలు చేపట్టే అధికారాన్ని నిరాకరిస్తూ  ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో సీబీఐ ప్రవేశానికి వెసులుబాటు కల్పించే "సమ్మతి" ఉత్తర్వులను ఏపీ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. గతంలో ఇచ్చిన సమ్మతి నోటిఫికేషన్‌ ను విత్‌ డ్రా చేసు కుంటూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

Image result for No entry GO of AP for CBIఢిల్లీ మినహా మిగతా రాష్ట్రాల్లో సీబీఐ తన అధికారాలను వినియోగించుకోవాలంటే ఆయా రాష్ట్రాల "సాధారణ సమ్మతి" తెలపవలసి ఉంటుంది. అయితే ఏపీ ప్రభుత్వం ఆ ఉత్తర్వులను రద్దు చేయడంలో రాష్ట్రంలో దాడులు, దర్యాప్తు చేసేందుకు సీబీఐ పరిది రద్దు అయినట్టు పేర్కొంది. రాష్ట్రంలో పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ సంస్థలు అంటే రైల్వె, తపాల, ఇంకం టాక్స్, ఎక్సైజ్ ఇంకా ఎన్నో ఉద్యోగులను విచారించడానికి కూడా సీబీఐకి అధికారం ఉండదు. తద్వారా రాష్ట్రంలో పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై కూడా రాష్ట్ర  ఏసీబీనే దర్యాప్తు చేయాల్సి ఉంటుంది. కాగా, చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రభుత్వం అందులోని మంతృలు, ప్రజాప్రతినిధులపై పలు అనుమానాలకు తెరలేపింది. 

Image result for No entry GO of AP for CBI దేశంలో సీబీఐ ప్రతిష్ట దెబ్బతిందని చెపుతున్న చంద్రబాబు గుర్తించవలసిన విషయం ముందు తన పార్టీ ప్రభుత్వ తన తన యంత్రాంగం ప్రతిష్ట పరువు ప్రజా విశ్వాసం నిన్న విడుదల చేసిన జిఓ తోనే పోయింది. ఈ నిర్ణయంపై పెద్ద ఎత్తున ప్రజాబాహుళ్యం నుండి విమర్శలు వస్తున్నాయి. అసలు ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన ఈ జీవో ఏ మేరకు న్యాయబద్ధమైనది అనే విషయంపై పలువురు నిపుణులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం చంట్టబద్దమైన పనులు చేయటమేకాదు అలా చేస్తున్నట్లు ప్రజలు విశ్వసించటం అవసరం.

Image result for No entry GO of AP for CBI

కేంద్ర ప్రభుత్వ సంస్థలు రాష్ట్రంలోని వ్యాపార సంస్థలపై దాడి చేస్తే, వారు తన అనుచరులైన పక్షంలో దేశంలో ప్రజాస్వామ్యం దెబ్బ తింటుందని గగ్గోలు పెట్టటం ఏం న్యాయం? అంతటితో ఆగకుండా ఇప్పుడు ఏకంగా సీబీఐ రాష్ట్రంలో అడుగుపెట్టడాన్ని నిరాకరిస్తూ జీవో జారీ చేయడాన్ని ప్రజాస్వామ్య వాదులు తప్పుబడుతున్నారు. అంతే కాదు ఏ ప్రజాస్వామ్యవాది అంగీకరించడు. దీన్నిబట్టి ప్రభుత్వంలో ఉన్నవారి అవినీతి అసాంఘిక కార్యక్రమాలపై దాడి చేయ కూడదా? అలాఇతే రేపు ప్రభుత్వం బయట ఉన్న నేరస్తులను ఎలా విచారిస్తారు? ఇప్పుడు చంద్రబాబు ఇంతగా వ్యతిరేఖిస్తున్నాడంటే చంద్రబాబు అసాంఘిక అవినీతి కార్యక్రమాల చిట్ఠా నరేంద్ర మోడీ చేతిలో ఉన్నట్లే.   

 Image result for No entry GO of AP for CBI

 అంతే కాకుండా రాష్ట్ర విపక్షనేత, వైసిపి అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహనరెడ్డిపై జరిగిన హత్యాయత్నం ఘటనపై, రాష్ట్రానికి చెందని ఏ విచారణ సంస్థతోనైనా విచారణ జరిపించాలని ఆయన హైకోర్టును కోరారు. లేదా కేంద్రప్రభుత్వ సంస్థలచే దర్యాప్తు చేయించాలని వైసిపి పోరాడుతున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తోపాటు, రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలిసి తమ డిమాండ్‌ను వారి దృష్టికి తీసుకెళ్లారు. హైకోర్టు కూడా ఈ కేసుకు సంబంధించి ఏపీ ప్రభుత్వానికి, డీజీపీకి నోటీసులు జారీ చేసింది. కేంద్ర సంస్థలచే విచారణ జరిపితే చంద్రబాబు లోసుగుల బాగోతం బయటపడుతుందనే భయంతో, కేసును పక్కదారి పట్టించాలనే ఆలోచనతో చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకుని ఉంటారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. చంద్రబాబు సీబీఐ అంటే ఎందుకు భయపడుతున్నారని, గజగజ వణుకుతున్నారని విపక్షాలు సూటిగా ప్రశ్నిస్తున్నాయి.

 Image result for No entry GO of AP for CBI

 ఒకప్పుడు వైసిపి అధినెదతపై సీబీఐ దాడులను కీర్తించిన చంద్రబాబు, ఇప్పడు సీబీఐకి రాష్ట్రంలోకి అనుమతి లేదంటూ నిర్ణయం తీసుకోవడం మారోమారు ఆయన అవకాశవాదాన్ని తెలియజేస్తుంది. అంతేకాదు రాష్ట్రంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగి ఉంటుందని కేంద్ర సంస్థలు, నిగ్గు తెలుస్తున్న వేళ, ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ విషయంలో ఈ విధంగా వ్యవహారించడం వల్ల ప్రజల్లో పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. అంతే కాదు చంద్రబాబు దేశంలోని అప్రజాస్వామిక కేంద్ర ప్రభుత్వ వ్యతిరేఖ శక్తులను ఈకీకృతం ఇంకెలా చెస్తారు. ఏ ముఖం పెట్టుకొని వారిని యునైట్ చేయగలుగుతారు?

Image result for No entry GO of AP for CBI 

రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉత్తర్వులను జారీ చేసిన విషయాన్ని కూడా కేవలం తమకు అనుకూల మీడియాకు మాత్రమే తెలుప డాన్ని గమనిస్తే, దీని వెనుక ఏదైనా దేశ వ్యతిరెఖ శక్తులు పనిచేసే పెద్ద కుట్ర ఉన్నట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


నారా చంద్రబాబు నాయుడు ఇక నెఱస్తుడని ఇప్పుడు నిర్ధారణ చేసుకోవచ్చేమో? తనపై సిబీఐ తదితర కేంద్ర సంస్థలు దాడి చేయనున్నాయని చెపుతూ గత ఆరునెలలుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలను తన చుట్టూ వలయంగా ఏర్పడి కాపాడాలంటూ దీనం గా అర్ధిస్తూ వస్తున్నారు. సరే సిబీఐ, ఈడి లాంటి కేంద్ర విచారణ సంస్థలు దాడి చేస్తే చేయాల్సింది తాను నీతిమంతుడను, నిజాయతిపరుడను, నిప్పును అని నిరూపించుకోవాల్సింది పోయి - సిబీఐ రాష్ట్రంలోకి ప్రవేసించటానికి వీలులేదని జిఓ ఇవ్వ టం ఆయనది నేఱగ్రస్థ చరిత్ర అని ప్రత్యక్షంగా అంగీకరించటమే. చంద్రబాబును గౌరవించేవాళ్లు సైతం ఈచర్యతో ఆయన ను క్షమించబోవటం లేదని అంటున్నారు. బహుశ ఆయన ఏదో దుర్మార్గాలు చేసినట్లేనని సందేహం లేకుండా చెప్పవచ్చు. 

Image result for No entry  for CBI  G.O issued by AP Undavalli

మరింత సమాచారం తెలుసుకోండి: