తెలంగాణ ఎన్నికల్లో టీఆర్‌నేత కేసీఆర్ ఒంటి చేత్తో గెలిపించారు. ఐతే.. కాంగ్రెస్ నేతలు మాత్రం ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని బలంగా వాదిస్తున్నారు. ఏదో ఓడిపోయిన బాధలో మాట్లాడుతున్నట్టు కాకుండా ఈ వాదనకు కట్టుబడి ఉంటున్నారు. న్యాయపోరాటానికి సిద్దమవుతున్నారు. తమ వాదనకు బలం చేకూరేలా ఆధారాలు సేకరించేందుకు ఓ కమిటీ కూడా వేసుకున్నారు.



టీ ఆర్ఎస్ నేతలు మాత్రం ఈవీఎం ట్యాంపరింగ్ వాదనను పూర్తిగా కొట్టిపారేశారు. రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్‌లలో కూడా కాంగ్రెస్ ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసే విజయం సాధించిందా అని ఎదురుదాడి చేస్తున్నారు. ఇలా చర్చ ఈవీఎంల చుట్టూ తిరుగుతున్న సమయంలో టీవీ9 ఛానల్‌ కు సంబంధించిన ఓ వీడియో కలకలం సృష్టిస్తోంది.



ఈవీఎంల ట్యాంపరింగ్‌కు ఆస్కారం లేదని వాదిస్తున్న టీఆర్‌ఎస్ నేతలకు ఈ పాత టీవీ9 వీడియో ఆలోచనలో పడేస్తోంది. ఇంతకీ ఆ వీడియో ఏంటంటారా.. 2009 ఎన్నికల సమయంలో ఈవీఎం ట్యాంపరింగ్ కు సంబంధించి టీవీ9 చర్చను చేపట్టింది. కొందరు నిపుణులు ఈవీఎంల ట్యాంపరింగ్ నిజమే అంటూ స్టూడియోలోనే ఎలా చేస్తారో చూపించారు.



ఇదే చర్చలో టీవీ9 టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కూడా ఫోన్ ద్వారా పాల్గొన్నారు. నిపుణులు చెప్పినట్టు 100శాతం ఈవీఎం ట్యాంపరింగ్ కు అవకాశాలు ఉన్నాయని.. దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలని కేసీఆర్ అన్నారు. 2009 ఎన్నికల్లో కచ్చితంగా ట్యాంపరింగ్ జరిగిందని ఆయన ఫోన్ ద్వారా ఆరోపించారు. ఇప్పుడు ఈ వీడీయోను కాంగ్రెస్ వర్గాలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నాయి. ఐతే.. ఇది జరిగి తొమ్మిదేళ్లు గడచిన నేపథ్యంలో ఈవీఎంల్లో చాలా మార్పులు వచ్చాయని.. వీవీ ప్యాట్ సౌకర్యం కూడా వచ్చింది కాబట్టి ట్యాంపరింగ్ అంత సులభం కాదని నిపుణులు చెబుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: