తెలంగాణలో రెండోసారి అధికారంలోకి వచ్చాక కేసీఆర్ కొన్ని మీడియా సంస్థలపై గుర్రుగా ఉన్నారు. ప్రత్యేకించి ఎన్నికల చివరి అంకంలో మహాకూటమికి అనుకూలంగా.. తనకు వ్యతిరేకంగా ఆ పత్రికలు ప్రచారం చేశారని ఆయన భావిస్తున్నారు. అందుకే ఇటీవల ప్రెస్ మీట్లలోనూ తరచూ మీడియాను టార్గెట్ చేస్తున్నారు.



ఆమధ్య ఓ ప్రెస్‌ మీట్లో.. కొన్ని బాకా పత్రికలు చంద్రబాబుకు భజన చేస్తున్నాయని నేరుగానే విమర్శలు గుప్పించారు. ఆంధ్రాలో జరిగిన విషయాలన్నీ ఇక్కడి ఎడిషన్లలో ప్రచురించడం ఎందుకని ప్రశ్నించారు. ఆ దరిద్రం మాకెందుకు అని ఈసడించారు. దీనిపై ఆంధ్రజ్యోతి పత్రిక ఎండీ రాధాకృష్ణ తన కొత్తపలుకు కాలమ్‌లో స్పందించారు.

సంబంధిత చిత్రం


ధ్రప్రదేశ్‌ వార్తలను తెలంగాణలో ప్రచురితమవుతున్న పత్రికలలో ఎందుకు ఇస్తున్నారు? ఆ దరిద్రం మాకు ఎందుకు? అని ప్రశ్నించిన కేసీఆర్... తన ప్రభుత్వ విజయాలకు సంబంధించిన ప్రకటనలను మాత్రం ఆంధ్రప్రదేశ్‌లో ప్రచురితం అవుతున్న పత్రికలకు ఇచ్చుకుంటున్నారని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష పాత్ర పోషిద్దామనుకుంటున్న కేసీఆర్‌కు అక్కడి దరిద్రం తెలంగాణ నుంచి ప్రచురితమవుతున్న పత్రికలలో ప్రచురితం కాకపోతే ఏపీలో ఏమి జరుగుతుందో ఎలా తెలుస్తుందని కామెంట్‌ చేసారు.

kcr vs radhakrishna కోసం చిత్ర ఫలితం


చంద్రబాబును ఓడించాలనుకుంటున్న కేసీఆర్‌కు ఈ పాయింట్‌ ఎందుకు తట్టలేదో? అంటూ ఎద్దేవా చేశారు. ‘ఆడవారి మాటలకు అర్థాలు వేరులే..’ అని ఒక సినీ కవి అన్నారు కానీ.. ‘రాజకీయ నాయకుల మాటలకు అర్థాలు వేరులే..’ అని మనం ఇప్పుడు సవరించుకోవాలంటూ సెటైర్లు కూడా వేశారు ఏబీఎన్‌ రాధాకృష్ణ. మరి రాధాకృష్ణ ప్రశ్నలకు కేసీఆర్‌ ఏ ప్రెస్‌మీట్లో సమాధానం చెబుతారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: