జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో, గుంటూరు జిల్లా నరసరావుపేటలో, శనివారం నిర్వహించిన సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ సదస్సులో, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి,  అజేయ కల్లం ముఖ్యఅతిథి గా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి జనచైతన్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి.లక్ష్మణరెడ్డి అధ్యక్షత వహించారు.

ajeya kallam in jana chaitanya vedika కోసం చిత్ర ఫలితం

పౌర సమాజం నాశనం కావడానికి ముఖ్యంగా మూడు కారణాలున్నాయని చరిత్ర చెబుతోందన్నారు. 

*అందులో మొదటిది కుటుంబ వ్యవస్థ నాశనం కావడం,

*రెండోది విద్యా వ్యవస్థ నాశనం కావడం,

*మూడోది తప్పుడు వ్యక్తులను ఆదర్శంగా తీసుకోవడమని చెప్పారు.

ajeya kallam in jana chaitanya vedika కోసం చిత్ర ఫలితం

అజేయ కల్లం మాట్లాడుతూ: 

"తమ పార్టీ కార్యకర్తలకు ఉపయోగపడేలా, వారికి లాభం చేకూరే పథకాలను ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్నాయి. దీనివల్ల సమాజంలో అవినీతి వ్యవస్థీకృతంగా మారుతోంది. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ ప్రస్తుతం రాష్ట్రంలో అమలవుతున్న నీరు–చెట్టు, గ్రామీణ ఉపాధి హామీ పథకాలు ఆయా పథకాల పనులను నామినేషన్‌పై జన్మభూమి కమిటీ లకు, అధికారపార్టీ కార్యకర్త లకు ఇస్తున్నారు. జన్మభూమి కార్యక్రమాలన్నీ వారు సంపాదించుకోవడానికి మాత్రమే ఉద్దేసించినవే. 


ఎపి ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిపై అజేయ కల్లం మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. ఏపీలో జరుగుతున్న అవినీతి, అక్రమాలను చూసి వరుణదేవుడు కూడా పలాయనం చిత్తగిస్తున్నాడని అన్నారు. ప్రజలు ప్రతి ఒక్కారు ప్రశ్నించే గుణం అలవాటు చేసుకోవాలని అప్పుడే ప్రభుత్వం చేసే అనేక స్కామ్ లకు అడ్డుకట్త పడగలదని రాష్ట్రంలో జరిగే అనేక అవినీతి, అక్రమాలను ప్రస్తావించారు.

సంబంధిత చిత్రం

*పెద్దపెద్ద ప్రాజెక్టుల్లో కూడా 40 శాతం నిధులను సీఎం నుంచి ఎమ్మెల్యేల వరకు పంచేసుకుంటున్నారని 


*గృహనిర్మాణరంగం అతిపెద్ద అవినీతి కాసారంగా మారిందని, అడుగుకి ₹1300/-చొప్పున పక్కరాష్ట్రాల్లో ఇస్తుంటే, ఏపీలో ₹10000/-చొప్పున ఇస్తున్నారని తెలిపారు.


*‘భోగాపురం ఎయిర్‌ పోర్టు నిర్మాణంలో భారీ అవినీతి జరుగుతోందని, 2700 ఎకరాల్లో ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణానికి ప్రభుత్వం టెండర్లు పిలిస్తే టెక్నికల్‌ బిడ్‌ లో రెండు కంపెనీలు పాల్గొన్నాయి. అందులో ఒకటి ప్రభుత్వ కంపెనీ ఎయిర్‌-పోర్ట్స్‌ అథారిటీ కాగా, రెండోది జీఎమ్మార్‌. టెక్నికల్‌ బిడ్‌ లో అర్హత సాధించిన అనంతరం ఫైనాన్షియల్‌-బిడ్స్‌ పిలిస్తే ఎయిర్‌-పోర్ట్‌ అథారిటీ రెవెన్యూలో 30.20% ఇస్తామని చెప్పగా, జీఎమ్మార్‌ 21.60% శాతం ఇస్తామని బిడ్‌లో తెలిపింది. ప్రభుత్వ కంపెనీ ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ నుంచి కమీషన్లు గుంజడం కుదరదనే ఉద్దేశంతో ఎలాగైనా జీఎమ్మార్‌కు టెండర్‌ కట్టబెట్టాలని కుట్రపన్నారు. చిన్నచిన్న కారణాలు చూపించి కేబినెట్‌లో పెట్టుకుని ఆ టెండర్‌ రద్దు చేశారు.

bhogapuram airport master plan కోసం చిత్ర ఫలితం

*కాకినాడ భూముల కేటాయింపులో కోట్ల రూపాయలు అక్రమంగా చేతులు మారాయి.


*ఫైబర్-నెట్ పేరుతో కేబుల్-వ్యవస్థను చేతుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వపెద్దలు భావిస్తున్నారు. ₹1200/-లకు దొరికే సెట్-టాప్ బాక్స్, ₹ 4000/- చొప్పున కొనుగోలు చేశారు. రూ.2,000 కోట్లు దోచుకోవడం కోసం 10 లక్షల బాక్సులు సరిపోవని 64 లక్షల సెట్‌-టాప్‌ బాక్సుల కొనుగోలుకు ఇటీవలే జీవో విడుదల చేశారు. ఇప్పటికే దీంతో ₹2000 కోట్లకుపైగా దోపిడీ చేశారు.

fibernet ap plans కోసం చిత్ర ఫలితంfibernet ap plans కోసం చిత్ర ఫలితం

*కేబుల్‌ ఆపరేటర్లను తమ అధీనంలో పెట్టుకుని తమకు అనుకూలంగాలేని చానళ్ల గొంతు నొక్కడం కోసమే ప్రభుత్వం ఫైబర్‌-నెట్‌ను తెరపైకి తెచ్చింది. ఈ ఫైబర్‌నెట్‌ కాంట్రాక్టులను కూడా అనర్హులకే కట్టబెట్టారు.

fibernet ap plans కోసం చిత్ర ఫలితం

*పెద్దపెద్ద నేషనల్ హైవేలకు కిలోమీటరుకు ₹ 18 కోట్లు కేటాయిస్తే, అమరావతి నగరంలో రోడ్ల నిర్మాణానికి ₹ 36 కోట్లు కేటాయించారంటే, అవినీతి ఏ స్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు.


*10 లక్షల మరుగుదొడ్లు నిర్మించామని ప్రభుత్వం చెబుతున్నా, వాస్తవానికి క్షేత్రస్థాయిలో అందులో 40 శాతం కూడా లేవు. 


*కాంగ్రెస్ హయాంలో ఆసరా పింఛన్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో పడేవి. టిడిపి అధికారంలోకి వచ్చాక పింఛన్ల పంపిణీ బాధ్యతలను "జన్మభూమి కమిటీ" లకు అప్పగించారు.


*రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు, పోస్టింగ్‌లు లోకల్ ఎమ్మెల్యే సిఫారసు లేనిదే జరగని పరిస్థితి నేడు నెలకొంది. నరసరావుపేటలో "కేఎస్సార్‌ ట్యాక్స్‌" పేరుతో అధికార పార్టీ నేతలు కూరగాయలు అమ్ముకునేవారిని కూడా వదలడం లేదు.

ap irrigation projects కోసం చిత్ర ఫలితం

*ఏపీకి రాయల్టీ రూపంలో ₹ 10000 కోట్లు రాబడి ఉండవలసింది - ట్రాక్టర్‌ ఇసుకకు ₹200/- చొప్పున రోజుకు ₹7.2 కోట్లు టీడీపీ ఎమ్మెల్యేలు, నాయకులకు వెళ్తోంది.


*ఈ నాలుగున్నరేళ్ల కాలంలో ఇసుక  తవ్వే కాంట్రాక్టర్లు, ప్రజా ప్రతినిధులు ₹30,000 కోట్ల నుంచి ₹40,000 కోట్లు సొమ్ము దోచేసుకుంటున్నారు. గురజాల నియోజకవర్గంలో ఒక ప్రజా ప్రతినిధి ఇసుక మైనింగ్‌ రూపంలో ₹1000 కోట్లు కూడగట్టేశాడు. 

ap sand booking online కోసం చిత్ర ఫలితం

*ప్రాజెక్టుల కోసం ₹35000 కోట్ల అప్పు - ప్రభుత్వం ₹50,000 కోట్లతో ఇరిగేషన్‌ ప్రాజెక్టుల పనులు చేపడితే అందులో ₹ 25000 కోట్ల నుంచి ₹30000 కోట్ల వరకు ముఖ్యమంత్రికి, మంత్రులకు వెళుతోంది. ₹ 2.20 లక్షల కోట్ల అప్పు ఉందని ఇటీవల విడుదల చేసిన శ్వేతపత్రంలో ప్రకటించిన ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణం కోసం బడ్జెట్‌ లో డబ్బు లేకపోయినా వివిధ కార్పొరేషన్‌ లు, సంస్థలకు గ్యారంటీగా ఉండి ₹ 35,000 కోట్ల అప్పు తెచ్చినట్టు చెప్పింది. కంటింగెంట్ లయబిలిటీస్ తీవ్ర నష్టాలను తెచ్చే అవకాశం ఎప్పుడూ ఉంటుంది.

ap sand contracts & Policy కోసం చిత్ర ఫలితం

*కన్సల్టెన్సీ-చార్జీల పేరుతో గత నాలుగున్నర సంవత్సరాల్లో ప్రభుత్వం చెల్లించిన సొమ్ము గత 70 సంవత్సరాల్లో అన్ని ప్రభుత్వాలు చెల్లించినదానికంటే ఎక్కువ. కన్సల్టెన్సీ చార్జీల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం   ₹500 కోట్లు చెల్లించింది. అన్ని పనులను కన్సల్టెన్సీలకే అప్పగిస్తూ చార్జీలు చెల్లిస్తున్నప్పుడు ప్రభుత్వాని కి ఇక ఉద్యోగులు ఎందుకు? అని అజేయ కల్లం ప్రశ్నించారు. 

ajeya kallam in jana chaitanya vedika కోసం చిత్ర ఫలితం

అవినీతిలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని గట్టెక్కించాలంటే 40ఏళ్ల అనుభవజ్ఞులు కాదు అంకిత భావంతో పనిచేసేవారు కావాలి. రాయలసీమకు చెందిన పెద్ద పెద్ద రైతులు హైదరాబాదులో చిత్తుకాగితాలు ఏరుకుంటున్నారని అజేయ కల్లాం వ్యాఖ్యానించారు. ఏపీలోని రైతుల పరిస్థితి దారుణంగా ఉందని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: