భారత దేశంలో ఉగ్రవాదులు దాడులకు తెగబడుతున్న నేపథ్యంలో పుల్వామ దాడిలో నలభై మంది వీర జవాన్లు అమరులైన విషయం తెలిసిందే.  అమర జవాన్ల కుటుంబాలకు సినీ, రాజకీయ,క్రీడా రంగం నుంచి చేయూత లభిస్తుంది.  ఈ నేపథ్యంలో తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు  ప్రారంభానికి ముందు పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు సంతాపం తెలుపుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
Related image
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ జవాన్ల కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పారు. అమరులైన ఒక్కో జవాను కుటుంబానికి రూ. 25 లక్షలు ఇవ్వనున్నట్టు ప్రకటించారు. అనంతంరం జీఎస్టీ చట్టానికి తీసుకువచ్చిన సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. 
Image result for కేరళ వరదలకు తెలంగాణ ప్రభుత్వం
ఆ మద్య కేరళాలో సంభవించిన విపత్తకు సైతం తెలంగాణ ప్రభుత్వం  రూ. 25 కోట్ల తక్షణ సాయం ప్రకటించారు. వరదల వల్ల నీరు కలుషితం అవుతున్నందున నీటిని శుద్ధి చేసేందుకు రూ.2.5 కోట్ల విలువైన ఆర్వో యంత్రాలను కేరళకు పంపాలని అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. 


మరింత సమాచారం తెలుసుకోండి: