వడ్డించేవాడు మనవాడో మన కులపోడో మన బామ్మర్దో ఐతే ఆ ఆనందమే వేరు. మనం ఏమూల కూర్చున్నా మన లడ్డూలు మనకు రావడం గారెంటీ. ఈ విషయాన్ని మన రాష్ట్ర మీడియాకి ప్రభుత్వానికి అనుసంధానిస్తే – ఎందుకంటే ప్రభుత్వ అధినేతల సామాజిక వర్గం అలాగే దానికి మద్దతిచ్చే మీడియా సామాజిక వర్గం ఒకటే కాబట్టి.

 CAG on AP Government కోసం చిత్ర ఫలితం

అయితే మీడియాకు ప్రభుత్వ ప్రచార ప్రకటనలు ఇవ్వడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చూపుతున్న వివక్షను సి ఏ జి - కాగ్ - కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ తప్పు పట్టింది.దీనికి సంబందించిన కదనం కూడా ఆసక్తికరంగా ఉంది. కారణం కోసం కొందరి కోసమే పనిచెసే ప్రభుత్వం ఇప్పుడు ఆరాష్ట్రాన్ని పాలిస్తుంది.

 

ఈనాడు, ఆంధ్రజ్యోతి” పత్రికలకు, ఆ మీడియా హౌజెస్ కు “అత్యధిక ప్రచార ప్రకటనల వ్యాపారం” కట్టబెట్టారని తెలుస్తుంది. ఇందులో భారీ సర్క్యులేషన్‌ గల సాక్షి పత్రిక, మీడియా హౌజ్” కు మాత్రం అతి తక్కువ ప్రచార ప్రకటనలను  కల్పించారని, ఇందులోనే వివక్ష కళ్లకు కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని పేర్కొంది.

 CAG comments on AP Government Advertisement to Enadu Andhra jyoti Media కోసం చిత్ర ఫలితం

CBNaidu’s ₹54.04 Crore gift to Andhra Jyothi & Eenadu!


ఇందుకు కారణాలు ఏమిటో? తెలిచేయాలని, ఒక విధానం లేకుండా ప్రచార ప్రకటనలు ఎలా జారీ చేశారో? సమాధానం చెప్పాల్సిందిగా సమాచార శాఖను “కాగ్‌” కోరింది. దీనిపై సమాచార శాఖ కమిషనర్‌ - కాగ్‌కు లిఖిత పూర్వక సమాధానమిస్తూ, ముఖ్యమంత్రి, ఆయన కార్యాలయం ఆదేశాల మేరకే ఆ రెండు పత్రికలకు ఎక్కువ ప్రచార వ్యాపారాన్ని  కల్పించామని-సాక్షికి తక్కువ వ్యాపారాన్ని ఇవ్వటానికి కూడా వారి ఆదేశాలే కారణమని స్పష్టం చేశారు.

 eenadu & Andhra Jyothi కోసం చిత్ర ఫలితం

దీనిపై సంతృప్తి చెందని కాగ్‌, సరైన సమాధానం చెప్పాల్సిందిగా మరో సారి కోరింది. దీనిపై కూడా సమాచార శాఖ కమిషనర్‌ లిఖిత పూర్వకంగా సమాధానం ఇస్తూ ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి కార్యాలయం (సి ఎం ఓ) ఆదేశాల మేరకే పని చేశామని, అంత పెద్దస్థాయి నుండి వచ్చిన ఆదేశాలను అమలు చేయడం తప్ప తాము చేయగలిగేదేముందని వివరణ ఇచ్చారు.

 

2015–16 ఆర్థిక సంవత్సరం నుంచి 2017–18 వరకు సమాచార శాఖ జారీ చేసిన ప్రచార ప్రకటనలు కాగ్‌ నివేదికను రూపొందించింది. మూడేళ్లలో సమాచార శాఖ ప్రచార ప్రకటనలకు ₹ 125.42 కోట్ల రూపాయలను వ్యయం చేసిందని, ఇందులో 44 శాతం అంటే ₹ 54.04 కోట్ల రూపాయల మేర ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలకే ప్రయోజనం కలిగించిందని కాగ్‌ ఎత్తి చూపింది.

 sakshi media group కోసం చిత్ర ఫలితం

అత్యధిక సర్క్యులేషన్‌ గల సాక్షి పత్రికకు కేవలం ₹ 8.99 కోట్ల రూపాయల ప్రకటనల వ్యాపారం మాత్రమే ఇచ్చారని, ఇంతకంటే తక్కువ సర్క్యులేషన్‌ గల ఆంధ్రజ్యోతి కి అత్యంత భారీ ప్రచార వ్యాపారం ఎలా కల్పించారు? అని ప్రశ్నించింది.


ప్రకటనల జారీలో సహజ న్యాయాన్ని, పారదర్శకతను పాటించలేదని ‘కాగ్‌’ ఘాటుగా వ్యాఖ్యానించింది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిష్పక్షపాతంగా వ్యవహరించ లేదని తేటతెల్లమైందని పేర్కొంది. ఇందులో మన నిప్పులాంటి ముఖ్యమంత్రి పాలనకు కాగ్ నిప్పును వదిలేసి ఆ ప్రభుత్వం ముఖం పై బూడిద జల్లినందున ప్రభుత్వం సమాధానం ఇవ్వవలసి ఉంది.

CAG on AP Government కోసం చిత్ర ఫలితం 


మరింత సమాచారం తెలుసుకోండి: