తెలంగాణలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల వలసలు కొనసాగుతున్నాయి. టీఆర్‌ఎస్‌లోకి కొత్తగా చేరుతున్న కాంగ్రెస్ నేతల బలంతో కలుపుకుని ఆ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య సెంచరీకి చేరువుతోంది. ఈ పరంపర చూస్తుంటే.. కేసీఆర్‌కు చిరకాల ప్రత్యర్థిలా ఉన్న జగ్గారెడ్డి కూడా పార్టీ మారుతారని ప్రచారం జరుగుతోంది. 

సంబంధిత చిత్రం


సంగారెడ్డి నుంచి కాంగ్రెస్ పక్షాన ఎన్నికైన ఆయన తాను ఎట్టి పరిస్థితిలోను పార్టీ మారబోనని చెబుతూ వచ్చారు. కాని ఒక టీవీ చానల్ లో వస్తున్న కధనం ప్రకారం ఆయన తన అనుచరులతో  పార్టీ మారే అంశంపై తీవ్రంగా చర్చిస్తున్నారట. అంతే కాదు.. ఆయన తన ఫోన్ కూడా స్విచ్చ్ఆప్ చేసుకున్నారట. 

ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే..  జగ్గారెడ్డి గతంలో కేసిఆర్ పై, హరీష్ రావుపై తీవ్ర విమర్శలు చేసేవారు. ఎన్నికల తర్వాత కెసిఆర్ ను పొగుడుతూ, హరీష్ రావును విమర్శిస్తున్నారు. ఈ నేపధ్యంలో జగ్గారెడ్డి టిఆర్ఎస్ తీర్ధం పుచ్చుకోబోతున్నారన్న సమాచారం వచ్చింది.

సంబంధిత చిత్రం

ఓ ప్రధాన పత్రికలో ఇవాళ వచ్చిన కథనం ప్రకారం తాను పార్టీ మారేదిలేదని జగ్గా రెడ్డి చెప్పినట్టు వచ్చింది. కానీ.. రాజకీయాలలో ఏమైనా జరగవచ్చు. చివరికి కాంగ్రెస్ పార్టీ ని మెజార్టీ ఎమ్ఎల్యేలు టిఆర్ఎస్ లో విలీనం చేశామని చెప్పినా ఆశ్చర్యపోనక్కర్లేదు. గతంలో తెలుగుదేశం విషయంలో అదే జరిగింది కదా. 



మరింత సమాచారం తెలుసుకోండి: