గత మూడు దశాబ్దాలకి పైగా రెడ్డి సామాజికవర్గం నేతలు ఏలుతున్న అనపర్తి నియోజకవర్గంలో ఈసారి కూడా వారే పోటీలోకి దిగుతున్నారు. గత ఎన్నికల్లో తెదేపా తరపున మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మూలారెడ్డి తనయుడు రామకృష్ణారెడ్డి బరిలో దిగారు. వైసీపీ తరపున మాజీ ఎమ్మెల్యే తేతలి రామారెడ్డి మేనల్లుడు డాక్టర్‌ సత్తి సూర్యనారాయణరెడ్డి పోటీ చేశారు. అయితే స్వల్ప మెజారిటీతో రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇక ఈసారి కూడా టీడీపీ నుంచి రామకృష్ణారెడ్డి, వైసీపీ నుంచి సూర్యనారాయణలే పోటీ చేస్తున్నారు. జనసేన తరుపున రేలంగి నాగేశ్వరరావు బరిలో ఉన్నారు. అయితే ప్రధాన పోరు తెదేపా-జనసేనల మధ్యే ఉంటుంది.


గత ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో ఓటమి పాలైన సానుభూతి వైకాపా అభ్యర్ధి డాక్టర్‌ సూర్యనారాయణరెడ్డిపై ఉంది. అలాగే ఓడినా నియోజకవర్గంలోని ప్రజలకు అందుబాటులో ఉంటూ...పార్టీని బలోపేతం చేశారు. జగన్ పాదయాత్ర తర్వాత కూడా పార్టీకి బలం పెరిగింది ఇవన్నీ వైకాపాకి కలిసిరానున్నాయి. ఇక తెదేపా తరుపున సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రామకృష్ణారెడ్డి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు, చంద్రబాబు పనితీరు మీదే రామకృష్ణారెడ్డి ప్లస్ పాయింట్స్. కానీ ప్రభుత్వం మీద కొంత వ్యతిరేకత రావడం రామకృష్ణకి ఇబ్బందికర పరిణామం. 

ఇక జనసేన నుంచి రేలంగి నాగేశ్వరరావు బరిలో ఉన్నారు. ఆయన ఎన్నికల ముందు నుంచే ప్రజల్లో తిరుగుతున్నారు. కొంతవరకు పవన్ ఇమేజ్ జనసేనకి కలిసొస్తుంది. కానీ ప్రధాన పోటీ తెదేపా-వైకాపాల మధ్యే జరుగుతుంది. ఈ నియోజకవర్గంలో పెదపూడి, బిక్కవోలు, రంగంపేట, అనపర్తి మండలాలు ఉన్నాయి. అలాగే ఇక్కడ బీసీ ఓటర్లు అధికంగా ఉన్నారు. తర్వాత క్రమంలో ఓబీసీలు, ఎస్సీలు ఉన్నారు. రెడ్డి సామాజికవర్గీయులు 30శాతం మించకపోయినా ఇక్కడ వారే చక్రం తిప్పుతున్నారు. అయితే బీసీ ఓటర్లే ఏ పార్టీ అభ్యర్ధి గెలుపునైనా డిసైడ్ చేయగలరు. ఇక ఏ పార్టీ గెలుపు అంత సులువు కాదు. తెదేపా-వైకాపాలు ఇక్కడ హోరాహోరీగా పోరాడుతున్నాయి. వైకాపాకు కాస్త ఎడ్జ్ ఉన్న‌ట్టు ప్రాథ‌మిక అంచ‌నా..మరి చివరికి ప్రజలు ఏ పార్టీ వైపు మొగ్గుచూపుతారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: