ఇప్పుడు రాజకీయమంతా సర్వేల చుట్టూనే నడుస్తోంది. ఏ పార్టీ అయినా సరే టికెట్లు ఇవ్వాలంటే సర్వే.. నాయకుడి పని తీరు ఎలా ఉందంటే సర్వే.. ఏ పథకాలు పెట్టాలంటే సర్వే.. ఏ హామీ ఇవ్వాలంటే సర్వే.. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికలపై వైసీపీ అంచనాలు ఏమిటి..? 


అసలు వైసీపీ ఎన్ని సీట్లు గెలుస్తామనుకుంటోంది. ఆ పార్టీ చేయించుకున్న సర్వేల్లో ఏ విషయాలు వెల్లడయ్యాయి.. ఓసారి పరిశీలిద్దాం..  ఆ పార్టీ అంచనాల ప్రకారం.. అనంతపురం జిల్లా నుంచి గుంటూరు జిల్లా వరకూ అంటే రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల వరకూ పరిశీలిస్తే.. మొత్తం 90 వరకూ అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 

ఈ 90 అసెంబ్లీ సీట్లలో గత ఎన్నికల్లో వైసీపీ 48 స్థానాలు గెలుచుకుంది. ఈసారి ఆ సంఖ్యను 71 వరకూ పెంచుకుంటామని ఆ పార్టీ అంచనాలు వేసుకుంటోంది. ఇక కృష్ణా జిల్లా నుంచి మిగిలిన కోస్తా జిల్లా విషయానికి వస్తే.. ఇక్కడ 85 వరకూ అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. 

గత ఎన్నికల్లో వైసీపీ ఫెయిలైంది ఇక్కడే.. ఈ జిల్లాల్లో వైసీపీకి కేవలం 20 అసెంబ్లీ స్థానాలు మాత్రమే వచ్చాయి. కానీ ఈసారి ఈ జిల్లాలో కనీసం 35 స్థానాలు గెలుచుకుంటామని వైసీపీ అంచనా వేస్తోంది. మొత్తం మీద 175 అసెంబ్లీ స్థానాల్లో సులభంగా 110 సీట్లు గెలుచుకుంటామని వైసీపీ అంతర్గత సర్వే చెబుతోందట. 



మరింత సమాచారం తెలుసుకోండి: