జీవితంలో ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చెయ్యడం తెలియని నలభైయేళ్ళ సుధీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీ ఇంకా తెలుగు దేశం పార్టీతోనే ఉందనే భ్రమలో ఉన్నారని విమర్శించారు. తెలుగు దేశం పార్టీ రాష్ట్రంలో చేసిన దోపిడీలు మద్దతు మీడియాను అడ్డుపెట్టుకుని కొనసాగించీ అరాచకాలు మరచిపోలేదన్నారు. తాను తెలుగుదేశం పార్టీ కి మద్దతు ఇవ్వడం లేదని తన ఎమ్మెల్యేలకు అర్థమయ్యేలా చెప్పాలని చంద్రబాబుకు హెచ్చరిక చేశారు. పవన్ కళ్యాణ్ మనతో లేడు అనేది వారికి అర్థమయ్యేలా చెప్పా లని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. 


ఇకపోతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై టీడీపీ ఎమ్మెల్యే వర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్‌ కళ్యాణ్ మన స్నేహితుడే, అంతా కలిసే పనిచేద్దాం! అంటూ పార్టీ కార్య కర్తలకు పిలుపు నిచ్చారు. మరోవైపు విశాఖ జిల్లా టీడీపీ ఎన్నికల పరిశీలకుడు, మాజీ మంత్రి మెట్ల సత్యనారాయణరావు తనయుడు మెట్ల రమణ బాబు సైతం జనసేన పార్టీ తెలుగు దేశం పార్టీల మధ్య ఎలాంటి విబేధాలు లేవని స్పష్టం చేశారు. అమలాపురం టీడీపీ ఎంపీ అభ్యర్థి గంటి హరీష్ మాధుర్ మద్దతు కోసం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్‌ కళ్యాణ్, చంద్రబాబు కలిసే ఉన్నారని, వారి మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. 

 à°¸à°‚బంధిత చిత్రం

 పవన్‌ కళ్యాణ్‌, చంద్రబాబు కలిసే ఉన్నారని స్పష్టం చేశారు. వాళ్లిద్దరూ బద్ద శత్రువులుగా లేరని అర్ధవంతమైన రాజకీయ సంభందాలతోనే ఉన్నారు. మధ్యలో చిన్న డిస్ట్రబెన్స్‌ క్రియేట్‌ అయిందన్న రమణ బాబు ఇప్పుడైతే ఇద్దరూ కలిసే ఉన్నారంటూ చెప్పుకొచ్చారు.  జనసేన, టీడీపీ రెండూ కలిసే ఉన్నాయని వ్యాఖ్యానిస్తూ టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయంగా పవన్ కళ్యాణ్ ను కలవరపాటుకు గురి చేస్తున్నాయి. రాబోయే ఎన్నికల్లో జనసేన ఒంటరిగా పోటీ చేస్తుందని పదే పదే చెప్తున్నప్పటికీ టీడీపీ నేతలు మాత్రం రెండు ఒక్కటేనని ప్రచారం చేస్తుండటం జనసేన తీవ్రంగా పరిగణిస్తోంది. 

pawan kalyan says no relations with TDP and chandrababu కోసం చిత్ర ఫలితం \

మరింత సమాచారం తెలుసుకోండి: