జనసేన. ప్రశ్నిస్తానంటూ రాజకీయ అరంగేట్రం చేసిన పవర్‌ స్టార్‌.. పార్టీ స్థాపించిన తర్వాత ఐదేళ్లకు జరుగు తున్న ఎన్నికల్లో ఘనంగా పోటీ చేస్తున్న పార్టీ ఇది. దాదాపు 120 స్థానాల్లో అసెంబ్లీ అభ్యర్థులను పోటీకి నిలబె ట్టారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న రెండు ప్రధాన పార్టీలు టీడీపీ, వైసీపీలను తలదన్నేలా జనసేన దూసు కుపోతుందని, దూకుడు ప్రదర్శిస్తుందని అందరూ అనుకున్నారు. అయితే, అనూహ్యంగా ఏ పాత్ర పోషించా లో.. తెలియని రాజకీయ నటుడుగా మారిన జనసేనాని పవన్‌ కళ్యాణ్‌.. చివరాఖరుకు అధికార పార్టీ టీడీపీకి భజన పరుడుగా మారిపోయారు. గత 2014 ఎన్నికల్లో బహిరంగంగానే టీడీపీని బలపరిచిన పవన్‌.. ఇప్పుడు మాత్రం లోపాయికారీ ఒప్పందం చేసుకున్నారు. 


లేదులేదంటూనే టీడీపీ-జనసేనలు చెట్టాపట్టాలేసుకుని ముందుకు సాగుతున్నాయి. దీనికి అనేక ఉదాహరణలు సైతం తెరమీదికి వస్తున్నాయి. ప్రతిపక్షంగా ప్రబుత్వ విధానాలను ఎండగట్టాల్సిన పవన్‌ ఆ పనిని ఏనాడో మానే శారు. ప్రతిపక్షం వైసీపీపై దుమ్మెత్తి పోయడంలో తన సత్తాను చాటుకున్నారు. తన విజ్ఞతను నిరూపించుకున్నా రు. బాబు పట్ల అపార భక్తిని చాటుకున్నారు. ఈ పరిణామాలు రాష్ట్ర వ్యాప్తంగా చిరాకు పుట్టించినా పవన్‌కు మాత్రం ఆనందం కలిగించాయి. ఒకపక్క తాను ఈ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తున్నామని చెబుతున్నారు. మరోపక్క, టీడీపీ కూడా అదే మాట చెబుతోంది. కానీ, ఈ రెండు పార్టీలూ లోపాయికారీ ఒప్పందంతోనే ముందుకు సాగుతున్నాయని అంటున్నారు పరిశీలకులు. 


టీడీపీ-జనసేనల మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందనడానికి ఎన్నికల్లో చంద్రబాబు అనుసరించిన వ్యూహమే ప్రధాన ఉదాహరణగా చెబుతున్నారు పరిశీలకులు. జనసేన తరఫున పోటీలో నిలిచిన అభ్యర్థులు ఉన్న చోట టీడీపీ తన అభ్యర్థుల సత్తాను పక్కకు పెట్టింది. మీరు పోటీలో ఉండండి. కానీ, ఉన్నట్టు నటించండి. జనసేనకు అనుకూలంగా పనిచేయండి. జనసేనను గెలిపించండి. అవసరమైతే.. నిధులు కూడా సర్దుబాటు చేయండి అని విశాఖ నుంచి ఈ కడ వరకు కూడా జనసేనకు లోపాయికారీ ప్రయోజనం చేకూరుస్తున్నారు. గాజువాక, భీమవరం, నరసాపురం తదితర స్థానాల్లో పవన్‌ను టీడీపీ వెనుకేసుకు వస్తోంది. ఆయా నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు డమ్మీలుగా మారుస్తున్నారు. 


ఇక, ఇదేసమయంలో జనసేన కూడా టీడీపీ లో కీలక నేతలు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో వారికి అనుకూలంగా తెరచాటుగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. జ‌న‌సేన కీల‌క నేత‌లు పోటీ చేస్తోన్న నియోజ‌క‌వ‌ర్గాల్లో సైలెంట్ అవ్వాల‌ని చంద్ర‌బాబు నేరుగా చెప్పిన‌ట్టు కూడా వార్త‌లు వ‌స్తున్నాయి. దీంతో టీడీపీ సీనియ‌ర్లు బాబు తీరుపై గుస్సాగా ఉన్న‌ట్టు టాక్‌. తాము పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉంటే ఇదేం తీరు అని వారంతా తీవ్ర ఆవేద‌న‌తో ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఈ మొత్తం పరిణామంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ రెండు పార్టీల దోస్తీపై పెద్ద ఎత్తున చర్చ సాగుతుండడం గమనార్హం. 



మరింత సమాచారం తెలుసుకోండి: