నెల్లూరు సిటీ నియోజకవర్గానికి ఎలాగైనా తన ఖాతాలో వేసుకోవాలని తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతూ వస్తోంది.  గత ఎన్నికల్లో ఈ స్థానం నుంచి పోటీ చేసి గెలిచిన అనిల్‌కుమార్ యాదవ్‌కు  పోటీగా మంత్రి నారాయణ నిలబెట్టిన విషయం తెలిసిందే.  అయితే నెల్లూరు సిటీ కైవసం చేసుకోవడానికి నారాయణ అండ్ కో ఎన్నో ఎత్తులు వేసిందని వైసీపీ ఆరోపించారు. 


ఈ నేపథ్యంలో నారాయణ కాలేజ్ సిబ్బంది వద్ద డబ్బులు సీజ్ చేశారు టాస్క్ ఫోర్స్ వారు.  ఏది ఏమైనా ఈసారి నెల్లూరు సిటీ  నాదే అంటున్నారు వైసీపీ నేత అనీల్ కుమార్ యాదవ్.  ఆయన ఓటు వేసిన అనంతరం మాట్లాడుతూ..ఈ రోజు ఎన్నికల సరళిపై ఎన్నో విమర్శలు వస్తున్నాయి..కానీ ఆంధ్రప్రజలు మాత్రం చాలా ఉత్సాహంతో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.  రాష్ట్రంలో నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే ధృఢ సంకల్పంతో ఏపి ప్రజలు ఉన్నారని అనీల్ పేర్కొన్నారు. 


ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో పది ఎమ్మెల్యే స్థానాలు..రెండు ఎంపీస్థానాలు కైవసం చేసుకోబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు.  ఎక్కడ ఓటర్లను అడిగినా ఫ్యాన్ కే ఓటేశాం అన్న మాట వినిపిస్తుంది. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి జగనే అవుతారు..ప్రజలకు మేలు చేస్తారు అని అన్నారు.  తెలుగు దేశం ప్రభుత్వం ప్రజలకు ఎన్నో ప్రలోభాలతో లోంగదీసుకోవాలని చూసినా వారి మాటలు నమ్మకుండా ప్రజల ఆశిస్సులు జగన్ కి అందజేశారు.  ఈ సదర్భంగా ఆంధ్రప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: