మొన్నటి తెలంగాణ ఎన్నికల్లో లెక్క ఘోరంగా తప్పినా లగడపాటి సర్వే కు ఉన్న క్రేజ్ వేరు. కాకపోతే తెలంగాణ ఎన్నికలు ఇచ్చిన షాక్ తో ఆయన సర్వే చేయించినా వాటి వివరాలు మాత్రం వెల్లడి చేయలేదు. మే 19 న ఏడోదశ పోలింగ్ ముగిశాకే తన సర్వే ఫలితాలు ప్రకటిస్తానంటున్నాడు. 


ఐతే.. ఈ లోపు లగడపాటి టీమ్ సభ్యుడొకరి సంభాషణగా చెబుతున్న ఆడియో లీక్ అయ్యింది. ఈ ఆడియోలో జనసేన పరిస్థితిపై చర్చ వినిపిస్తోంది. పవన్ కల్యాణ్ ను అంతా తక్కువ అంచనా వేస్తున్నారని..కానీ జనసేన వ్యక్తికి ఫోన్ చేశాడట.

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనకు 14-22 సీట్లు వచ్చే అవకాశముందని లగడపాటి టీమ్ సర్వే అంచనా వేసినట్టు తెలుస్తోంది. వాస్తవానికి ఇదేమంత పెద్ద నెంబర్ కాదు.. కానీ దాదాపు అన్ని సర్వేలు జనసేనకు పది లోపే అసెంబ్లీ స్థానాలు వస్తాయని చెబుతున్న సమయంంలో 22 వరకూ సీట్లు వస్తాయన్న వార్త ఆనందం కలిగించేదే. 

ఈ ఆడియోను జనసేన టీమ్ వైరల్ చేస్తోంది. ఇక జనసేన లోక్ సభ విషయానికొస్తే  2-3 ఎంపీ సీట్లలో విజయం సాధించవచ్చట. సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ పోటీచేసిన విశాఖ, నాగబాబు బరిలో ఉన్న నర్సాపురంతో పాటు అమలాపురంలోనూ జనసేన గెలవొచ్చని అంచనా. ఈ ఆడియో బయటకు వచ్చాక జనసైనికుల ముఖాల్లో కాస్త కళ కనిపించింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: