రాజకీయ నాయకుల్లో ఒక్కొక్కరిలో ఒక్కో లక్షణాలు ఉంటుంటాయి. వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు తన తండ్రి నుంచి వారసత్వంగా ఒక లక్షణం అబ్బింది. దివంగత మాజీ ముఖ్యమంత్రి  వైయస్ రాజశేఖర్ రెడ్డి  ఎవరికైనా మాట ఇస్తే ఆ మాట నిలబెట్టుకునే వరకు ఆయన మర్చిపోలేదు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో  అధికార, విపక్ష పార్టీల్లో ఆయన ద్వారా రాజకీయంగా ఎంతో ఎత్తుకు ఎదిగిన శిష్యులు ఎంతోమంది ఉన్నారు. తనను నమ్ముకున్న వారికి మాట ఇచ్చి ఆ మాట నెరవేర్చే విషయంలో  తండ్రి వారసత్వాన్ని ఆదర్శంగా తీసుకున్న జగన్, టిడిపి అధినేత చంద్రబాబు నమ్మించి వంచించిన ఫ్యామిలీకి ఇప్పుడు అదిరిపోయే లైఫ్ ఇస్తున్నారు. మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి కుటుంబం గత ఎన్నికలకు ముందు టిడిపి నుంచి నంద్యాల,  శ్రీశైలం నియోజకవర్గాల్లో పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయింది. 


ఆ ఎన్నికల్లో ఆ రెండు నియోజకవర్గాలలో టీడీపీ నుంచి పోటీ చేసేందుకు బలమైన అభ్యర్థులు లేనిపక్షంలో చంద్రబాబు శిల్పా సోదరులు ఇద్దరిపై తీవ్రమైన ఒత్తిడి చేసి  మీరే పోటీ చేయాలని బరిలో ఉంచారు. ఆ ఎన్నికల్లో శిల్పా సోదరులు వైసిపి అభ్యర్థులకు గట్టి పోటీ ఇచ్చి చివరిలో ఓడిపోయారు. ఆ తర్వాత నంద్యాల ఉప ఎన్నికల సమయంలో చంద్రబాబు  శిల్ప‌ కుటుంబాన్ని ఘోరంగా అవమానించారు. గత ఎన్నికలకు ముందు ప‌ట్టు బ‌ట్టి మరి టీడీపీలోకి ఆహ్వానించి వారికి నంద్యాల, శ్రీశైలం సీట్లు ఇచ్చిన బాబు  ఉప ఎన్నికల్లో శిల్పా చక్రపాణి రెడ్డి గ్యారెంటీగా గెలుస్తానన్న రిపోర్టులు ఉన్నా సీటు మాత్రం ఇవ్వలేదు. భూమాతో పాటు మంత్రి అఖిల బెదిరింపుల‌కు లొంగి రాజ‌కీయ అనుభ‌వం లేని భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డికి సీటు ఇచ్చారు. ఆ త‌ర్వాత ఆయ‌న గెలిచేందుకు ఎంత తంతు జ‌రిగింది అన్న‌ది తెలిసిందే.


నంద్యాల ఉప ఎన్నికల్లో జగన్‌ను నమ్మి వైసీపీలోకి వచ్చి పోటీ చేసి ఓడిన శిల్పా సోదరులు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని జగన్ వమ్ము చేయలేదు. ఎన్నికల్లో శిల్ప కుటుంబానికి జగన్ రెండు సీట్లు కేటాయించారు. నంద్యాల సీటును శిల్పా మోహన్ రెడ్డి తనయుడు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డికి ఇచ్చిన జగన్.... శ్రీశైలం సీటును తనను నమ్మి ఆరేళ్ల పాటు ఉన్న తన ఎమ్మెల్సీ పదవిని సైతం వ‌దులుకుని పార్టీలోకి వచ్చిన శిల్పా సోదరుడు శిల్పా చక్రపాణి రెడ్డికి ఇచ్చారు.  నంద్యాల ఉప ఎన్నిక సమయంలో శిల్పా చక్రపాణి రెడ్డి తన ఎమ్మెల్సీ పదవితో పాటు.... జిల్లా టిడిపి అధ్యక్ష పదవికి సైతం రాజీనామా చేసి పెద్ద సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. నంద్యాల ఉప ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ కీలక నేతలతో పాటు కోట్లాది రూపాయలు కుమ్మరించిన చంద్రబాబుకు ఈ ఎన్నికల్లో నంద్యాల ఓటర్ ఎలాంటి ? షాక్ ఇస్తాడు అని ఎదురుచూడటం ఒక్కటే మిగిలి ఉంది. 


నంద్యాల ఉప ఎన్నికల్లో 27 వేల ఓట్ల మెజార్టీతో గెలిచిన టిడిపి ఈసారి నంద్యాలలో గెలుపుకోసం ఏటికి ఎదురీదుతూ ఉంది. ఇక శ్రీశైలం లోనూ శిల్పా చక్రపాణి రెడ్డి కమిట్‌మెంట్ నచ్చిన నియోజకవర్గ ప్రజలు ఆయనను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఏదేమైనా జగన్‌ను నమ్మినందుకు శిల్పా ఫ్యామిలీకి రెండు సీట్లు దక్కాయి. అదృష్టం కలిసి వస్తే రేపు ఉదయం నుంచే ఇద్దరు అసెంబ్లీలో అడుగు పెట్టనున్నారు. అదే చంద్రబాబును నమ్ముకొని పార్టీ మారిన పలువురు నేతలకు ఎన్నికల్లో సీట్ల రాలేదు.



మరింత సమాచారం తెలుసుకోండి: