దేశ వ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో నేడు 9 రాష్ట్రాల పరిధిలోని 72 నియోజకవర్గాల్లో  నాలుగోదశ పోలింగ్ మొదలైంది.  ఇప్పటి వరకు మూడు దశలో పోలింగ్ లో దాదాపు కొన్ని చోట్ల మినహా ప్రశాంతంగా కొనసాగింది.  అయితే అక్కడక్కడా ఈవీఎం లు ఇబ్బందులు పెడుతున్నా వాటి స్థానంలో కొత్త ఈవీఎంలు ఏర్పాటు చేస్తున్నారు ఎలక్షన్ కమీషన్.  ఒడిశాలోని 41 శాసనసభ స్థానాలకు కూడా నేడే పోలింగ్ జరగనుంది. వాస్తవానికి ఇక్కడ 42 స్థానాల్లో పోలింగ్ జరగాల్సి ఉంది. అయితే, పత్కుర నియోజకవర్గ బిజూ జనతాదళ్ అభ్యర్థి మరణించడంతో ఎన్నిక వాయిదా వేశారు.


దాదాపు లక్షా 40 వేల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసింది .ఒడిశాలోని 41 శాసనసభ స్థానాలకు ఈరోజు పోలింగ్ జరుగుతుంది. వాస్తవానికి నలభై రెండు స్థానాల్లో పోలింగ్ జరగాల్సి ఉంది కానీ ఒక శాసనసభ స్థానం లోని అభ్యర్థి మరణించడంతో అక్కడ ఎన్నికలు వాయిదా పడ్డాయి. 


ఈ ఎన్నికల్లో బాలీవుడ్ నటి, కాంగ్రెస్ నేత ఊర్మిళా మతోండ్కర్, సంజయ్ దత్ సోదరి ప్రియాదత్, పూనం మహాజన్, మిలింద్ దేవరాలతోపాటు సల్మాన్ ఖుర్షీద్, శతాబ్దీరాయ్‌, మూన్‌మూన్‌ సేన్‌, కేంద్ర మంత్రులు గిరిరాజ్‌ సింగ్‌, సుభాష్‌ భామ్రే, ఎస్‌ఎస్‌ అహ్లువాలియా, బాబుల్‌ సుప్రియో తదితర ప్రముఖులు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: