తెలంగాణలో వైఎస్సార్ కాంగ్రెస్ మళ్లీ పుంజుకోబోతుందా.. ఏపీ రాజకీయాల్లో వైసీపీ అధికారంలోకి వస్తే... తెలంగాణలోనూ ఆ పార్టీ మళ్లీ యాక్టివేట్ అవుతుందా.. ఇక జగన్ తెలంగాణ రాజకీయాల్లోనూ కీలక పాత్ర పోషించబోతున్నాడా.. ఇది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.  


వాస్తవానికి వైసీపీ తెలంగాణలో ఉనికిలో లేదు. ఆ పార్టీకి నాయకులు లేరు. 2014 ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో  ఓ ఎంపీ, మూడు అసెంబ్లీ సీట్లు గెలుచుకున్న పార్టీ.. ఆ తర్వాత వారు టీఆర్‌ఎస్‌లోకి వెళ్లిపోయినా పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఏపీలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నందువల్ల.. జగన్ ఏపీలో సీఎం అయితే తెలంగాణలో వైసీపీ పుంజుకునే అవకాశం ఉంది. 

ఐతే.. ఇదంతా కేసీఆర్ ప్లాన్ లో భాగంగా జరుగుతోందన్నది ఈ విశ్లేషణ సారాంశం. తెలంగాణలో కాస్తో కూస్తో బలంగా ఉన్న కాంగ్రెస్‌ మూలాలను జగన్ పార్టీని తెలంగాణలో యాక్టివేట్ చేయడం ద్వారా చీల్చాలని కేసీఆర్ ఎత్తుగడ వేస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. 

కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా, లేకపోయినా.. నాయకులు ఉన్నా.. లేకపోయనా.. క్యాడర్ బలంగానే ఉందని.. అందుకే కాంగ్రెస్ ను మూలాల నుంచి దెబ్బ తీసేందుకు జగన్ పార్టీని అస్త్రంగా వాడుకోవాలని కేసీఆర్ ఆలోచిస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోందని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ ఓ చర్చలో చెప్పడం విశేషం. 



మరింత సమాచారం తెలుసుకోండి: