ప్ర‌స్తుతం టీవీ-9 సీఈవో ర‌విప్ర‌కాశ్ వ్య‌వ‌హారం తెలుగు మీడియా స‌ర్కిల్స్‌లో పెద్ద ట్రెండింగ్ న్యూస్‌గా మారింది. టీవీ-9 మేనేజ్‌మెంట్ ర‌విప్ర‌కాశ్‌ను సీఈవోగా త‌ప్పించేసి కొత్త సీఈవోను కూడా నియ‌మించేసింది. ఇదిలా ఉంటే ఇప్పుడు మ‌రో న్యూస్ ఛానెల్ V6కు సంబంధించిన ఓ వార్త తెలుగు మీడియా స‌ర్కిల్స్‌తో పాటు రాజ‌కీయ వ‌ర్గాల్లో ప్ర‌కంప‌న‌లు రేపుతోంది. ఈ ఛానెళ్లో తీన్మార్ కార్య‌క్ర‌మం ద్వారా బిత్తిరి స‌త్తి తెలుగు ప్ర‌జ‌ల‌కు బాగా ద‌గ్గ‌రైపోయారు. రాజ‌కీయ వ‌ర్గాల్లోనూ ఈ కార్య‌క్ర‌మం ప‌ట్ల మంచి ఆస‌క్తి ఏర్ప‌డ‌డంతో పాటు ఈ ఛానెల్ రేటింగ్ ఈ ప్రోగ్రామ్ వ‌ల్ల చాలా టాప్ ఛానెల్స్‌తో పోలిస్తే ముందే ఉంటోంది.


ఇక తాజాగా బిత్తిరి స‌త్తి అలియాస్ చేవెళ్ల రవి V6 ఛానెల్ వ‌దిలేసిన‌ట్టే అంటున్నారు. యాజ‌మాన్యం ప‌రంగా స‌త్తికి ఎలాంటి ఇబ్బంది లేక‌పోయినా ఆ ఛానెళ్లో ఉన్న కొంద‌రి తీరుతో హ‌ర్ట్ అయిన స‌త్తి ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. V6 చైర్మన్ వివేక్ సహా పలువురు ముఖ్యులు బిత్తిరి సత్తిని బుజ్జ‌గించ‌డానికి చేసిన ప్ర‌య‌త్నాలు ఫెయిల్ అయ్యాయ‌ని అంటున్నారు. అందుకే రెండు రోజులుగా ఆ ఛానెల్లో స‌త్తి చేసే కార్య‌క్రమాలు ఆగాయంటున్నారు.


ఈ క్ర‌మంలోనే మిగిలిన మీడియా ఛానెల్స్ స‌త్తిని త‌మ వైపున‌కు తిప్పుకునే ప్ర‌య‌త్నాలు కూడా ప్రారంభించేశార‌ట‌. కొంద‌రు మాత్రం సినిమాల్లో బిజీ అయ్యి ఛానెల్లో మానేస్తున్నాడేమో ? అని చెప్పుకుంటున్నారు. ప్ర‌స్తుతానికి స‌త్తి హైద‌రాబాద్‌లో లేడ‌ని తెలుస్తోంది. ఆయ‌న అభిప్రాయం తెలుసుకునేందుకు మీడియా స‌ర్కిల్స్‌లో కొంద‌రు పెద్ద వ్య‌క్తులు ప్ర‌య‌త్నాలు ప్రారంభించార‌ట‌.


ప్ర‌స్తుతానికి ఈ వార్త సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అవుతోంది. మ‌రి స‌త్తి నిజంగానే V6 ఛానెల్ నుంచి బ‌య‌ట‌కు వ‌స్తున్నాడా ?  లేదా ? ఇది కేవ‌లం గాసిప్పేనా ? అన్న‌ది తెలియాలంటే ఆయ‌న హైద‌రాబాద్ వ‌చ్చాక వివ‌ర‌ణ ఇవ్వాల్సి ఉంటుంది. గ‌తంలోనూ స‌త్తి ఈ ఛానెల్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేస్తున్న‌ట్టు ప్ర‌చారం జ‌రిగినా అలాంటిది జ‌ర‌గ‌లేదు. మ‌రి ఇప్పుడు కూడా ఈ వార్త గాసిప్‌గానే మిగిలిపోతుందా ?  లేదా ?  నిజం అవుతుందా ? అన్న‌ది స‌త్తి చెపితే గాని తెలియ‌దు.


మరింత సమాచారం తెలుసుకోండి: